రాజమౌళికి అందుకే పవన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం లేదా?
ఎందుకంటే పవన్ ...త్రివిక్రమ్ తో మరోసారి చేస్తున్నాడు...పూరీ తో మరోసారి చేసాడు...హరష్ శంకర్ తో చేసాడు....జయంత్ పరాంన్జీతో చేసాడు...ఎస్ జె సూర్యతో రెండు సార్లు చేసాడు..విష్ణు వర్ధన్ వంటి తమిళ దర్శకులను ఎంకరేజ్ చేసారు..అలాంటప్పుడు ఎందుకని రాజమౌళి వంటి టాప్ డైరక్టర్ ప్రాజెక్టుకి ఓకే చెప్పటం లేదు అనేది అభిమానుల్లోనూ సందేహమే.
అయితే పరిశ్రమలో ఓ వర్గం మాత్రం ఈ విషయమై తమదైన శైలిలో వ్యాఖ్యానిస్తోంది. వారు చెప్పేదాని ప్రకారం...రాజమౌళి,వినాయిక్ చిత్రాల్లో ఉండే మాస్ ఫైట్స్, యాక్షన్ ఓరియెంటెడ్ ఇంటర్వెల్ బ్యాంగ్స్. ...పవన్ కి నచ్చవు..అందుకే వారిద్దరికీ డేట్స్ ఇవ్వటం లేదని..చెప్తున్నారు. అలాగే పవన్ చిత్రాలు సాధారణంగా... ఏ దర్శకుడుతో చేసినా పూర్తిగా పవన్ బ్రాండ్ తో పవన్ చిత్రం గానే బయిటకు వస్తూంటాయి...అది రాజమౌళి వంటి మెగా దర్శకులు చిత్రాలకు కష్టమే అందుకే ఇవ్వటం లేదు అంటున్నారు. అంతేగాక గ్రాఫిక్స్ తో నడిచే చిత్రాలు దేనిలోనూ..పవన్ నటించనూ లేదు.
ఇక ఈ రీజన్ కేవలం ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపించేదే. అయితే రాజమౌళి ఇప్పటికే కథ చెప్పి ..వెయిట్ చేస్తున్నారా...లేక త్వరలో పవన్ ఓకే అన్న తర్వాత కథను రెడీ చేస్తారా తెలియాల్సి ఉంది. ఎన్ని చెప్పుకున్నా పవన్ చిత్రం అంటే ఓ క్రేజ్...ఓ ఢిఫెరెంట్...రెగ్యులర్ మాస్ చిత్రాలకు విభిన్నంగా ఉంటుందనేది మాత్రం నిజం.


Click it and Unblock the Notifications












