చరణ్ పెళ్లిలో పవన్ కళ్యాణ్ టెన్షన్ కి కారణం?
రామ్ చరణ్ పెళ్లిలో అందరి కళ్ళూ పవన్ కళ్యాణ్ పైనే ఉన్నాయన్నది నిజం. గత కొంత కాలంగా చిరు కుటుంబంలో కలతలు వస్తున్నాయని,పవన్ వారితో కలవటం లేదని వార్తలు వస్తున్నాయి. అయితే ఎప్పటికప్పుడు మెగా బ్రదర్శ్ మీడియా సమక్షంలో వాటిని ఖండిస్తూనే ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ వాటికి చెక్ పెడుతూ నిన్న రామ్ చరణ్ వివాహ వేడుకలో పాల్గొన్నారు. అయితే టెన్షన్ తో కనిపించటం జరిగిందని సమాచారం.
అయితే దానికి కారణం ...నిన్నటి రోజున పవన్ కి ఆప్తుడు అయిన గబ్బర్ సింగ్ నిర్మాత బండ్ల గణేష్ హాస్పటిల్ పాలవటమే. వివాహ వేడుకలు కాగానే ఆయన గణేష్ దగ్గరకి వెళ్లారు. పవన్ కళ్యాణ్ తో రీసెంట్ గా'గబ్బర్ సింగ్'చిత్రం తీసి ఘన విజయం సాధించిన బండ్ల గణేష్ పై దాడి జరిగింది. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆగపల్లి సాగర్ హైవే వద్ద గణేష్ కి స్థానికులు దేహశుద్ధి చేశారు. ఈ సంఘటన బుధవారం సాయంత్రం జరగింది. వివరాల్లోకి వెళితే..ఆగపల్లి హైవేపై బండ్ల గణేష్ ప్రయాణిస్తున్న కారు ఓ వ్యక్తిని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో బాధితుడికి తీవ్ర గాయలయ్యాయి. ఇది గమనించి ఆగ్రహించిన బాధితుని బంధువులు, స్థానికులు గణేష్‌పై దాడికి పాల్పడ్డారు. గాయపడిన గణేష్‌ను కామినేని ఆసుపత్రికి తరలించారు. కారు ఢి కొనడంతో గాయపడ్డ వ్యక్తిని కూడా సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇక ఖుషీ తర్వాత పదేళ్ల అనంతరం ఆ రేంజి హిట్ కొట్టారు పవన్ కళ్యాణ్ అని చెప్పుకుంటున్న నేపధ్యంలో గణేష్ కి మరో సినిమా కి డేట్స్ ఇస్తానని పవన్ ప్రామిస్ చేసాడని సమాచారం. పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై ఆ చిత్రం చేస్తానని చెప్పారని సమాచారం. అయితే ఆ చిత్రం కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రం షూటింగ్ పూర్తయ్యాక చేద్దామని,ఈ లోగా..కథ,దర్సకుడు పైనలైజ్ చేద్దామని చెప్పారని పిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.


Click it and Unblock the Notifications











