‘రెబల్’ లేటుకి అసలు రీజన్ ఏంటి?
ప్రభాస్, లారెన్స్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'రెబల్'. ఈ చిత్రాన్ని ఉగాదికి(మార్చి 23)విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి... అయితే అది జరగలేదు. ఇప్పటికీ చిత్రం ప్రారంభమై చాలా కాలం అయినా రిలీజ్ పై ఇంకా గందరగోళం ఉంది. ఈ నేపధ్యంలో అసలు ఈ చిత్రం ఎందుకిలా లేటవుతోంది అన్న విషయమై కొన్ని వార్తలు వినపడుతున్నాయి. లారెన్స్ నిర్లక్ష్యం,నిర్మాతలు ఆర్దిక ఇబ్బందులు వంటివి కాదని,అవన్నీ రూమర్సే అని తెలుస్తోంది. ఇప్పటికే సినిమా ప్రారంభమై చాలా రోజులు అయ్యిందని,త్వరగా విడుదల చేసి హిట్ కొట్టాలనే ఆలోచనలో ప్రభాస్ ఉన్నారు.
అయితే అసలు విడుదల లేటవటానికి కారణం ఏమిటీ అంటే..తమన్నా డేట్స్ అని చెప్తున్నారు. అనూష్కని కాదనుకుని తమన్నాని తీసుకున్నాక ఆమె డేట్స్ ఎడ్జెస్టు చెయ్యలేకపోయింది. ఆమె ఈ చిత్రం ఒప్పుకునే సరికే రచ్చ,ఎందుకంటే ప్రేమంట చిత్రాలు కమిటైంది. దాంతో ఆమె డేట్స్ కు తగినట్లు ప్రభాస్ డేట్స్ ఎడ్జెస్ట్ చెయ్యాల్సిన పరిస్దితి ఏర్పడింది. ఈ చిత్రంకోసం ఆమె రెగ్యులర్ డేట్స్ ఇవ్వకుండా జంపింగ్ క్రింద డేట్స్ ఇచ్చింది. అయితే ప్రభాస్ మరో చిత్రం వారిదిలో బిజీగా ఉండటంతో ఇద్దరి కాంబినేషన్ సీన్స్ చాలా కష్టమయ్యాయి. దాంతో ఈ ఇబ్బందిని దాటటానికి ఇప్పుడు మే నెలాఖరు దాకా వేరే చిత్రానికి చేయకూడదని బల్క్ డేట్స్ తీసుకుని ఎగ్రిమెంట్ చేయించుకున్నట్లు సమాచారం.
ప్రభాస్ సైతం ఈ చిత్రం పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఆయన ఈ చిత్రం గురించి చెపుతూ..షూటింగ్ టైమ్ లోనే నాకు మంచి కిక్ ఇస్తున్న సినిమా ఇది. లారెన్స్ ఎక్స్‌ట్రార్డినరీగా తీస్తున్నాడు. నా ఫ్యాన్స్‌కి నచ్చే అంశాలన్నీ ఇందులో ఉంటాయి.ఇందులో నా లుక్ డిఫరెంట్‌గా ఉంటుంది. టైటిల్‌కి తగ్గట్టుగా స్టైలిష్‌గా, పక్కా మాస్‌గా ఉంటుందీ సినిమా అని ప్రభాస్ చెప్తున్నారు. అలాగే ఈ చిత్రంలో డైలాగులకు అత్యంత ప్రాధాన్యత ఉండబోతోందని తెలుస్తోంది.
ఇక దర్శకుడు లారెన్స్ మాట్లాడుతూ...'రెబల్' అనే టైటిల్ మత్రమే కాదు. కథ కూడా ప్రభాస్ కోసమే అన్నట్టుగా ఉంటుంది. 'రెబల్' అనే టైటిల్ మత్రమే కాదు. కథ కూడా ప్రభాస్ కోసమే అన్నట్టుగా ఉంటుంది. ప్రభాస్ కెరీర్‌లో మాస్ ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకున్న సినిమా 'ఛత్రపతి'. ఆ సినిమాను మించే స్థాయిలో మా 'రెబల్' ఉంటుంది అన్నారు.
నిర్మాతలు జె.భగవాన్, జె.పుల్లారావు మాట్లాడుతూ -''డార్లింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్ లాంటి విజయాల తర్వాత వస్తున్న ప్రభాస్ సినిమా ఇది. తప్పకుండా ఈ సినిమా ప్రభాస్‌కి హ్యాట్రిక్ హిట్‌గా నిలుస్తుంది. తమన్నా, దీక్షాసేథ్ గ్లామర్ ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ. ఏ విషయంలోనూ రాజీ పడకుండా లారెన్స్ అద్భుతంగా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. ప్రభాస్ కెరీర్‌లోనే 'రెబల్' హై బడ్జెట్ ఫిలిం అవుతుంది'' అని చెప్పారు. 'ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: సి.రాంప్రసాద్, మాటలు: 'డార్లింగ్'స్వామి, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, నిర్మాణం: బాలాజీ సినీ మీడియా.


Click it and Unblock the Notifications











