ఎన్టీఆర్ కి ప్రియమణి నో చెప్పిందా?
ప్రియమణి కి ఇప్పుడు చేతిలో ప్రస్తుతం సినిమాలు ఏమీ లేవు.కానీ ఆమె ఆచి తూచి అడుగువెయ్యాలనుకుంటోంది.తాజాగా ఆమెను ఎన్టీఆర్ గా పేరు మార్చుకున్న తారకరత్న కలిసి తనతో సినిమా చెయ్యమని అడగటం జరిగిందని ఫిల్మ్ నగర్ టాక్.అయితే ఆమె సున్నితంగా తిరస్కరించిందని చెప్తున్నారు.ఆమె బాలకృష్ణతో మిత్రుడు,కళ్యాణ్ రామ్ తో హరేరామ్,ఎన్టీఆర్ తో యమదొంగ సినిమాలు చేయటంతో ఆమెతో చేయటంతో తనకూ లాభిస్తుందని భావించి అడగాడంటున్నారు.అయితే అసలే కెరీర్ లేక విలవిల్లాడుతున్న తాను తారకరత్న తో చేస్తే క్లైమాక్స్ కి వచ్చినట్లే అని భావిస్తోందిట.దాంతో తాను తమిళంలో బిజీగా ఉన్నానని,తెలుగులోనూ రెండు సినిమాలు టాక్స్ జరుగుతున్నాయని చెప్పి తప్పించుకుందిట.ఇక ప్రస్తుతం తారకరత్న నందీశ్వరుడు చిత్రంలో బిజీగా ఉన్నారు.కన్నడ చిత్రం డెడ్లీ సోమ రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.ప్రియమణి మాత్రం క్షేత్రం చిత్రం విడుదల అయితే తన కెరీర్ కి ఏమన్నా కదలిక వస్తుందేమో అని ఎదురుచూస్తోంది.క్షేత్రం సినిమాలో ఆమె నాగ పెంచలమ్మ గా కనిపించనుంది.అందులో జగపతిబాబు ఓ కీలకమైన పాత్రను చేస్తున్నారు.అలాంటి పరిస్దితుల్లో కూడా ప్రియమణి ..తారకరత్న కు నో చెప్పటం చాలా మందిని ఆశ్చర్యంలో పడేస్తే..మరికొందరు కెరీర్ పట్ల ఆమెకు ఉన్న ప్లానింగ్,జాగ్రత్త అలాంటివి అంటున్నారు.అదీ పాయింటేగా.


Click it and Unblock the Notifications











