బాలీవుడ్‌లో ప్రియాంక చోప్రాపై బ్యాన్.. ఆ ఇద్దరు హీరోల భార్యల కుట్రే?

మోడలింగ్ నుంచి సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు ప్రియాంక చోప్రా. ప్రస్తుతం ఆమె రేంజ్ బాలీవుడ్‌ను దాటి గ్లోబల్ రేంజ్‌కి వెళ్లిపోయింది. హాలీవుడ్‌తో పాటు ఇతర అంతర్జాతీయ ప్రాజెక్ట్స్‌లో నటిస్తూ గ్లోబల్ స్టార్ అనిపించుకున్నారు. అయితే కెరీర్ పీక్స్‌లో ఉండగా ప్రియాంక చోప్రా హఠాత్తుగా బాలీవుడ్‌ నుంచి అదృశ్యం కావడం కలకలం రేపింది. సక్సెస్ రేట్, నటన, అందం ఇలా అన్ని విషయాల్లోనూ టాప్‌లో ఉన్నప్పటికీ ప్రియాంక చోప్రాకు ఎందుకు ఆఫర్లు రాలేదన్నది ఇప్పటికీ మిస్టరీయే. తాజాగా దీనిపై సంచలన వ్యాఖ్యలు చేశారు బాలీవుడ్ దర్శకుడు సునీల్ దర్శన్. ఈ వివరాల్లోకి వెళితే..

మోడలింగ్ నుంచి స్టార్ హీరోయిన్‌గా
తమిళ చిత్ర పరిశ్రమలో తొలుత అడుగుపెట్టిన ప్రియాంక చోప్రా అక్కడి నుంచి ముంబైకి మకాం మార్చారు. వరుస హిట్స్‌తో స్టార్ హీరోయిన్‌గా, భారతదేశంలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే నటిగా నిలిచారు. సినీరంగానికి చేసిన సేవలకు గాను పిన్న వయసులోనే భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డ్ అందుకున్నారు. హాలీవుడ్‌లోనూ అవకాశాలు అందుకుని అక్కడా తన హవా చూపిస్తున్నారు.

why Priyanka Chopra moved out of Bollywood

SSMB29లో ప్రియాంక చోప్రా
తనకంటే పదేళ్లు చిన్నవాడైన అమెరికన్ సింగర్, హాలీవుడ్ రాపర్ నిక్ జోనాస్‌ను 2018లో ఆమె ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ విషయంలో ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ పట్టించుకోని ప్రియాంక.. సరోగసీ ద్వారా మాల్టీకి జన్మనిచ్చారు. ప్రస్తుతం లాస్ ఏంజిల్స్‌లో స్థిరపడిన ప్రియాంక చోప్రా.. అడపా దడపా ఇండియాకు వస్తున్నారు. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా తెరకెక్కుతోన్న ఎస్ఎస్ఎంబీ 29లో ప్రియాంక చోప్రా కీలకపాత్ర పోషిస్తున్నారు.

షారుఖ్‌తో ఎఫైర్?
అందరూ హీరోయిన్ల మాదిరిగానే ప్రియాంక చోప్రా విషయంలోనూ పలు గాసిప్స్, వివాదాలు వచ్చాయి. ముఖ్యంగా అగ్రనటులు షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్‌లతో ఆమె డేటింగ్ చేశారన్న గాసిప్స్ వైరల్ అయ్యాయి. వీటిపై షారుఖ్ భార్య గౌరీఖాన్ తీవ్రంగా స్పందించడమే కాకుండా ప్రియాంక చోప్రాకు అవకాశాలు దక్కకుండా చక్రం తిప్పారని అంటారు. మరో ఎపిసోడ్‌లో అక్షయ్ కుమార్‌తో ప్రియాంక చనువుగా ఉండటం బీ టౌన్‌లో చర్చనీయాంశమైంది.

అక్షయ్‌తో డేటింగ్?
బర్సాత్ అనే సినిమాలో ప్రియాంక చోప్రా- అక్షయ్ కుమార్ కలిసి నటించారు. ఈ సినిమాలో వారి ఆన్‌స్క్రీన్ రొమాన్స్‌తో పాటు బయట కూడా క్లోజ్‌గా ఉండటంతో.. పలు రకాలుగా వార్తలు రావడంతో అక్షయ్ భార్య ట్వింకిల్ ఖన్నా మనస్తాపానికి గురయ్యారని, ఏకంగా ఇంట్లో నుంచి వెళ్లిపోయారని బాలీవుడ్‌లో చెప్పుకుంటూ ఉంటారు. ఈ పరిణామాలతో అక్షయ్ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు దర్శకుడు సునీల్ దర్శన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రియాంకతో రిలేషన్‌పై పుకార్లు వస్తున్నప్పుడు అక్షయ్ జాగ్రత్త పడలేదని.. ఆయన చేసిన కొన్ని తప్పులు కూడా ఇందుకు కలిసొచ్చాయని సునీల్ వ్యాఖ్యానించారు.

కంగన సంచలన వ్యాఖ్యలు
షారుఖ్ ఖాన్ భార్య గౌరీఖాన్, అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నాలు బాలీవుడ్‌ను ఎంతగా ప్రభావితం చేయగలరో చెప్పనక్కర్లేదు. ట్వింకిల్ ఖన్నా తండ్రి.. బాలీవుడ్ సూపర్‌స్టార్ రాజేష్ ఖన్నా. హిందీ చిత్ర పరిశ్రమపై వీరి పట్టు ఏ స్థాయిలో ఉంటుందో సులభంగా అర్ధం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే గౌరీ, ట్వింకిల్‌ల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని బాలీవుడ్ దర్శక నిర్మాతలు ప్రియాంక చోప్రాకు అవకాశాలు ఇవ్వలేదని.. ఒకరకంగా ఆమెపై అప్రకటిత నిషేధం నడిచిందని ఇప్పటికీ చెప్పుకుంటారు. స్వయంగా ప్రియాంక చోప్రా కూడా బాలీవుడ్‌లో తనకు ఇబ్బందికర పరిస్ధితులు ఎదురయ్యాయని, కొందరు కుట్ర చేశారని పలు ఇంటర్వ్యూలలో చెప్పడం కొసమెరుపు. షారుఖ్‌తో ఎఫైర్ కారణంగా నిర్మాత కరణ్ జోహార్ బాలీవుడ్‌లో ప్రియాంక చోప్రాకు అవకాశాలు దక్కకుండా చేశారని ఫైర్ బ్రాండ్, ఎంపీ కంగనా రనౌత్ ఓ సందర్భంలో ఆరోపించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X