రాజమౌళిని అభినందించాలా...విషయం తగ్గిందనాలా...!?
రాజమౌళి దర్శకత్వం వహించే చిత్రాలన్నీ దరిదాపు అన్ని భారీ బడ్జెట్ తో కూడుకున్నవే. ముఖ్యంగా 'మగధీర" అత్యంత భారీ బడ్జెట్ తో తీశాడు. కానీ హఠాత్తుగా ఏమైందో కానీ ఈ మధ్య చిన్న సినిమాల మీద దృష్టి మళ్లించాడు. 'మగధీర" తర్వాత 'మర్యాద రామన్న" లాంటి చిన్న బడ్జెట్ చిత్రాన్ని తీశాడు. తాజాగా..'ఈగ" చిత్రాన్ని ఆరంభించాడు. ఇది కూడా ఓ మోస్తరు బడ్జెట్ సినిమానే. ఈ రెండు చిత్రాల్లోనూ స్టార్స్ లేరు. వాస్తవానికి ప్రభాస్ హీరోగా రాజమౌళి ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ అది వాయిదా పడిండి. ఆ సినిమాకి భారీ బడ్జెట్ అవుతుందని సమాచారం. ఒక స్టార్ డైరెక్టర్ వరుసగా స్టార్స్ లేకుండా రెండు సినిమాలు తల పెట్టాడు కాబట్టి..అతనిలో విషయం తగ్గిందని కొంతమంది మాట్లాడుకుంటున్నారు. కానీ..భారీ జడ్జెట్ తోనే కాకుండా చిన్న చిత్రాలు, చిన్న స్థాయి నటీనటులతో కూడా సినిమా చేస్తున్నందుకు రాజమౌళిని అభినందించాల్సిందే...


Click it and Unblock the Notifications











