రాజమౌళి అందుకే 'వేదం' చిత్రాన్ని మోస్తున్నారా?
రాజమౌళి..లేటెస్ట్ గా రిలీజైన 'వేదం' చిత్రానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారారని, ఏ ఛానెల్ తిప్పినా ఆయనే కనపడుతున్నారని వినపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆయనకు అంత అవసరమేమి వచ్చింది..నిజాయితీగానే సినిమా నచ్చి పొగడుతున్నారా లేక..వేరే కారణం ఉందా అంటే సమ్ అదర్ రీజన్ ఉంది అంటున్నారు. వేదం నిర్మాతలు...'మర్యాద రామన్న' నిర్మాతలు ఒకటే కావటమే ఆ కారణం అంటున్నారు. ఎందుకంటే గతంలో ఎన్నో మంచి చిత్రాలు వచ్చినప్పుడప్పటికీ ఎప్పుడూ రాజమౌళి ఇలా మీడియా ముందుకు వచ్చి ఇలా ఆ చిత్రం గురించి మాట్లాడలేదు. అలాగే తన గురువు కె. రాఘవేంద్రరావు గారి అల్లుడు కూడా నిర్మాత (ఆర్కా మీడియా)కావటం కూడా ఓ కారణం అంటున్నారు. ఏదైతేనేం ఓ మంచి చిత్రాన్ని ప్రమేషన్ చేసి మరింత ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేయటం మాత్రం అభినందనీయమే.
More from Filmibeat
వేదం క్రిష్ రాజమౌళి సునీల్ మర్యాద రామన్న రాఘవేంద్రరావు rajamouli krish vedam allu arjun anushka maryada ramanna


Click it and Unblock the Notifications











