రాజమౌళి తండ్రి పై నిషేదానికి కారణం అదేనా…!?
సుప్రసిద్ధ తెలుగు దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తండ్రి, విజయేంద్ర ప్రసాద్ ను ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నిషేధించిన విషయం విధితమే. ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్ పై బ్యాన్ విధించినట్లు ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ కౌన్సిల్ నుంచి మెంబర్స్ అందరికీ ఎస్ఎంఎస్ లతో ఈవార్త చెక్కర్లు కొడుతోంది. ఫిల్మ్ ఛాంబర్ నిబంధనల ప్రకారం 'నాన్ కోఆపరేషన్ యాక్టు" కింద ఆయనపై నిషేదం విధించినట్లు తెలుస్తోంది. కాగా చారిత్రక కథాంశంతో వస్తున్న 'రాజన్న" చిత్రం పూర్తి అయిన వెంటనే ఈ నిషేధం అమలులోకి వస్తుంది. కింగ్ అక్కినేని నాగార్జున మూవీ 'రాజన్న" చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు.
కాగా చిత్ర పరిశ్రమలోని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం నిర్మాత మేడికొండ మురళీతో వివాదమే విజయేంద్ర ప్రసాద్ నిషేదానికి కారణంగా తెలుస్తుంది. సినిమాకు స్క్రిప్ట్ సిద్దం చేస్తానని చెప్పి విజయేంద్ర ప్రసాద్, నిర్మాత మురళి వద్ద ఏడెనిమిది సంవత్సరాల క్రితం సుమారు 6-7 లక్షల రూపాయలు తీసుకున్నట్టు భోగట్ట. దీనికి సంబంధించి విజయేంద్ర ప్రసాద్ ఏ పనీ చేయక పోయినప్పటికీ, తీసుకున్న సొమ్ము సైతం తిరిగి ఇవ్వలేదని మేడికొండ మురళి ప్రధాన ఆరోపణగా తెలుస్తుంది.
మొత్తానికి, ఈ వివాదం పై ఇరువర్గాలతో చర్చించిన నిర్మాతల మండలి, స్క్రిప్ట్ రైటర్ మరియు దర్శకుడైన విజయేంద్ర ప్రసాద్ పై వేటు వేయాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. గతంలో కూడా విజయేంద్ర ప్రసాద్ డబ్బు వ్యవహారంలో పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగారు. మాజీ ఎమ్మెల్యే, నిర్మాత చెంగల వెంకట్రావ్ తనను డబ్బు కోసం బెదిరించారని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు కూడా. మరి ఇప్పుడు నిర్మాత మురళి అంటున్నారు...ఈ సంఘటన భవిష్యత్తులో ఏ రియాక్షన్స్ ఇస్తుందో వేచి చూడాల్సిందే...


Click it and Unblock the Notifications











