»   » రాజమౌళి ట్రాప్‌లో ఎన్టీఆర్, రాంచరణ్.. హాలీడే ట్రిప్ వెనుక మర్మం అదేనట..

రాజమౌళి ట్రాప్‌లో ఎన్టీఆర్, రాంచరణ్.. హాలీడే ట్రిప్ వెనుక మర్మం అదేనట..

Posted By:
Subscribe to Filmibeat Telugu
Ram Charan, NTR Holyday trip : Rajamouli master plan

రంగస్థలం సినిమా షూటింగ్ బీజీ నుంచి రాంచరణ్ ఇప్పుడే తేరుకొన్నాడు. ఇక ఎన్టీఆర్ త్వరలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రంతో బిజీగా మారబోతున్నాడు. ఈ మధ్య కాస్త సమయం చిక్కడంతో రాజమౌళి సినిమా కోసం అమెరికాకు వెళ్లిపోయారు. అయితే ఫోటోషూట్ కోసం యూఎస్ వెళ్లారనే వార్తలు ఓ పక్కన పెడితే.. వారి హాలీడే ట్రిప్ వెనుక మరో వార్త మీడియాలో హల్‌చల్ చేస్తున్నది. అదేమిటంటే..

 హాలీడే ట్రిప్ వెనుక రహస్యం

హాలీడే ట్రిప్ వెనుక రహస్యం

బాహుబలి చిత్రం తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో ఓ మల్టీస్టారర్‌ను తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అక్టోబర్‌లో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ లోపు ఇద్దరు యువ స్టార్ల మధ్య అవగాహన కల్పించడానికి రాజమౌళి ఓ హాలీడే ట్రిప్‌ను ఏర్పాటు చేసినట్టు ఆ వార్త సారాంశం.

సమస్యలు రాకుండా

సమస్యలు రాకుండా

ఇద్దరు స్టార్ హీరోలు ఒకే స్క్రీన్‌పై కనిపిస్తున్నారంటే.. తమ కోసం కాకపోయినా ఫ్యాన్స్ కోసం కొన్ని లెక్కలు వేసుకొంటారు. మల్టీస్టారర్ సినిమాలో హీరోలకు కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితులు రాకుండా ఎన్టీఆర్, చెర్రీ మధ్య స్నేహబంధాన్ని పెంచేందుకు రాజమౌళి ప్లాన్ చేస్తున్నారట.

 రాజమౌళి సూచన మేరకు

రాజమౌళి సూచన మేరకు

ఆ క్రమంలోనే ఎన్టీఆర్, రాంచరణ్‌ను హాలీడే ట్రిప్‌కు పంపినట్టు వార్తలు వస్తున్నాయి. రాజమౌళి సూచన మేరక వారిద్దరూ యూఎస్ ట్రిప్‌కు వెళ్లినట్టు సమాచారం. అక్కడే ఓ ఫోటోషూట్ కూడా తీసేలా ప్లాన్ చేశారట దర్శక ధీరుడు. రాంచరణ్ తిరిగి మార్చి 10వ తేదీ లోపు హైదరాబాద్ చేరుకొంటారనేది తాజా సమాచారం. మార్చి 11న రాంచరణ్ వైజాగ్‌లో జరిగే రంగస్థలం ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో పాల్గొంటారు.

అన్నదమ్ములుగా చెర్రీ, ఎన్టీఆర్

అన్నదమ్ములుగా చెర్రీ, ఎన్టీఆర్

రాజమౌళి దర్శకత్వంలో త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్న చిత్రంలో రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లు అన్నదమ్ములుగా కనిపిస్తారట. పాత్రలకు తగినట్టుగా వారిద్దరి మధ్య నేచురల్‌గా ఓ బాండింగ్ ఉండేలా రాజమౌళి చర్యలు తీసుకొంటున్నారట. సాధారణంగా తలెత్తే ఇగోలు రాకుండా ముందు నుంచే దర్శక ధీరుడు జాగ్రత్త పడుతున్నారట.

 కెమిస్ట్రీ వర్కవుట్ కోసం

కెమిస్ట్రీ వర్కవుట్ కోసం

రాంచరణ్, ఎన్టీఆర్ మధ్య స్నేహబంధం బలంగా ఉంటే వారి రిలేషన్ సానుకూల ప్రభావం చూపితే తెర మీద వారి కెమిస్ట్రీ బ్రహ్మండంగా ఉంటుందనే భావనలో రాజమౌళి ఉన్నట్టు సమాచారం. సాధారణంగానే ఎన్టీఆర్, చరణ్ మధ్య మంచి అనుబంధం ఇప్పటికే ఉందన సంగతి తెలిసిందే.

 షోలేలో మాదిరిగా

షోలేలో మాదిరిగా

రాజమౌళి రూపొందించే సినిమాలో ఉండే భావోద్వేగ అంశాలు షోలే సినిమాకు దగ్గరగా ఉంటాయనే మాట వినిపిస్తున్నది. షోలే సినిమాలో అమితాబ్, ధర్మేంద్ర మధ్య వర్కవుట్ అయిన కెమిస్ట్రీ మాదిరిగా పాత్రలను రూపొందించినట్టు సమాచారం.

 పోలీసు ఆఫీసర్లుగా

పోలీసు ఆఫీసర్లుగా

రాజమౌళి రూపొందించే చిత్రంలో రాంచరణ్, ఎన్టీఆర్‌ పోలీసు ఆఫీసర్లుగానూ, బాక్సర్లుగానూ కనిపిస్తారనే వార్త మీడియాలో నానుతున్నది. వారి పాత్రల కోసం ప్రత్యేకంగా శిక్షణ పొందుతున్నట్టు సమాచారం.

 హీరోయిన్లుగా సమంత, రాశీఖన్నా

హీరోయిన్లుగా సమంత, రాశీఖన్నా

రాజమౌళి ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌ను ఇప్పటికే పూర్తి చేశాడట. ఈ చిత్రంలో సమంత, రాశీఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మిగతా పాత్రల ఎంపికపై జక్కన దృష్టిపెట్టినట్టు తెలుస్తున్నది.

English summary
Ram Charan, NTR went on Holyday trip. This holyday planned by Rajamouli for friendship bond between two young heroes. As part of the holyday trip, These two are going to participate in photoshoot. Samantha Akkineni and Rashi Khanna approached for this multi starrer movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu