వెంకట్ కి దడతో కొడుకు షాక్ ఇస్తే..రాజన్నతో తండ్రి స్టోక్..?
'ఆటోనగర్ సూర్య" చేయడానికి నాగ చైతన్య డేట్స్ ఇవ్వడంతో కృతజ్ఞతగా అతని 'దడ" సినిమాని ఆర్ ఆర్ మూవీ మేకర్స్ వెంకట్ హోల్ సేల్ గా కొనేశాడు. అలాగే నాగార్జునతో ఢమరుకం చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు రాజన్న చిత్రాన్ని కూడా సొంతం చేసుకున్నాడు. 'దడ" సినిమాతో పెట్టిన పెట్టుబడి మొత్తం కోల్పోయిన వెంకట్ కి ఇప్పుడు రాజన్న సినిమాకి జరుగుతున్న హడావిడి కంగారు కలిగించొచ్చు.
'రాజన్న'గా అక్కినేని నాగార్జున గెటప్ అద్భుతం.. 'రాజన్న'గా నాగార్జున నటన అపూర్వం.. 'రాజన్న' నిర్మాణం అన్నపూర్ణ స్టూడియోస్‌కి అత్యంత ప్రతిష్టాత్మకం.. 'రాజన్న' చిత్రానికి విజయేంద్రప్రసాద్ దర్శకత్వం వహిస్తే ఎస్.ఎస్.రాజమౌళి పర్యవేక్షణలో యాక్షన్ దృశ్యాల్ని చిత్రీకరించడం విశేషం. ఎం.ఎం.కీరవాణి సంగీతం ఈ చిత్రానికి ప్రాణం.ఇన్ని హంగులున్న రాజన్న తో వెంకట్ ఎందుకు కంగారు పడుతున్నాడు అంటే... ఈ సినిమా విడుదల తేదిని కూడా ప్రకటించిన తర్వాత నాగార్జున రాజన్నని వాయిదా వేసి మరీ రీషూటింగ్ మొదలు పెట్టాడు. దాంతో ఈ చిత్రం పై ఒక్కసారిగా అనుమానాలు కలుగుతున్నాయి. అంత మంచి సీజన్ వదిలేసుకుని మరీ రీషూట్ కి వెళ్లారంటే ఈ చిత్రం ఎలా తెరకెక్కి ఉంటుందోనని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దడతో కొడుకిచ్చిన షాక్ తిన్న వెంకట్ కి రాజన్నతో తండ్రి ఇచ్చే స్ట్రోక్ తప్పదా అనుకుంటున్నారు..


Click it and Unblock the Notifications











