హాట్ టాపిక్ : మాస్క్ వేసుకున్న రామ్ చరణ్ (ఫొటో)

By Srikanya

హైదరాబాద్ : రామ్ చరణ్ మాస్క్ వేసుకున్న ఫొటో ఒకటి గోవిందుడు అందరి వాడేలే చిత్రంలోని వర్కింగ్ స్టిల్ బయిటకు వచ్చింది. ఇది చూసిన వారందరికీ ఎందుకు ఇలా రామ్ చరణ్ మాస్క్ వేసుకున్నాడంటూ ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్నారు. ఈ ఫ్యామిలీ స్టోరీలో ఏదన్నా తెలియనీ మిస్టరీ ఎపిసోడ్ ఉందా అని కొందరు సందేహపడుతున్నారు. అలాగే ఈ కొత్త లుక్ తో రామ్ చరణ్ చేసే సాహసాలు ఏముంటాయి అనేది సైతం హాట్ టాపిక్ గా మారింది.

నిర్మాత గణేశ్‌ తెలియజేస్తూ ‘‘ కృష్ణవంశీ అద్భుతంగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. యువన్‌శంకర్‌ సంగీతం సినిమాకు పెద్ద ప్లస్సవుతుంది. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు అనూహ్యమైన స్పందన లభించింది. రామ్‌చరణ్‌ లుక్స్‌ను అందరూ బాగా మెచ్చుకుంటున్నారు. సెప్టెంబర్‌ 15న పాటలనూ, అక్టోబర్‌ 1న చిత్రాన్నీ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని చెప్పారు.

Why Ram Charan wears a MASK

ఇక ఈ చిత్రం కాన్సెప్టు ఏంటంటే... పల్లెటూరంటే... పచ్చదనం, తెలుగుదనం. మనవైన ఆప్యాయతలు, అనురాగాలూ అక్కడే కనిపిస్తాయ్‌. పిన్ని, పెద్దమ్మ.. బాబాయ్‌, నానమ్మ, తాతయ్య - ఎన్ని పిలుపులో. ఇంకెన్ని ఆప్యాయతలో. ఈ అరమరికలు లేని ఆనందాన్ని అనుభవించాలని విదేశాలనుంచి వచ్చాడో కుర్రాడు. కానీ... ఇక్కడి అనుబంధాలూ కలుషితమైపోయాయని అర్థమయ్యింది. మరి ఇలాంటి వాతావరణాన్ని ఎలా చక్కదిద్దాడో, తాను కలలుకన్న ఉమ్మడి కుటుంబాన్ని తానే ఎలా నిర్మించుకొన్నాడో తెలియాలంటే 'గోవిందుడు అందరివాడేలే' చిత్రం చూడాల్సిందే.

దర్శకుడు మాట్లాడుతూ... ''కుటుంబ అనుబంధాల నేపథ్యంలో సాగే చిత్రమిది. ప్రతీ సన్నివేశంలోనూ తెలుగుదనం ఉట్టిపడుతుంది. రామ్‌చరణ్‌ విదేశాల్లో పుట్టి పెరిగిన యువకుడి పాత్రలో కనిపిస్తాడు. తనవారికోసం సొంతూరికి వచ్చిన ఓ ఎన్నారై యువకుడు ఎలాంటి సందడిని సృష్టించాడన్నది ఇందులో ఆసక్తికరం. చరణ్‌ తెరపై కనిపించే విధానం కొత్తగా ఉంటుంది. '' అని చెప్పుతున్నారు.

శ్రీకాంత్‌, ప్రకాష్‌రాజ్‌, జయసుధ, కమలినీ ముఖర్జీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు నటినటులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌రెడ్డి, నిర్మాత: బండ్ల గణేష్, సమర్పణ: శివబాబు గండ్ల, దర్శకత్వం: కృష్ణవంశీ. కూర్పు: నవీన్‌ నూలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X