రాణా, సెల్వరాఘవన్ సినిమా ఆగిపోయింది...ఎందుకంటే

By Srikanya

రాణా, సెల్వరాఘవన్ కాంబినేషన్ లో ఓ పీరియాడిక్ ఫిల్మ్ రాబోతోందని ఆ మధ్య వార్తలు అఫీషయల్ గానే వచ్చాయి. ఐదవ శతాబ్దంలో కథ జరుగుతుందని, అద్బుతమైన సెట్టింగ్స్ తో ఈ చిత్రం రూపొందనుందని, రాణా ద్విపాత్రాభినయం చేయనున్నాడని తెలిసింది. అయితే ఈ ప్రాజెక్టు ఆగిపోయిందని విశ్వసనీయ సమాచారం. సురేష్ బాబు,రాణా కలిసి ఈ ఓకే చేసిన స్క్రిప్టులో మార్పులు చెప్పారని, ఇప్పటికే రెండు సార్లు ఆ మార్పులు,చేర్పులు చేసిన సెల్వరాఘవన్ తానిక మార్చలేడని చేతులెత్తేసాడని వినపడుతోంది. రాణాని కమర్షియల్ హీరోగా నిలబెట్టాలని ఇంత భారీ బడ్జెట్ తో తీయాటానికి రెడీ అయ్యామని సురేష్ బాబు ఖచ్చితంగా చెప్పి ఆ మేరకు మార్పులు సూచించారట.

అయితే సెల్వరాఘవన్ ఆ మార్పులు కనుక చేస్తే కథా గమనం దెబ్బతిని,సోల్ ఉండకుండా పోతుందని ఒప్పుకోలేదుట. అందులోనూ కథ ప్రకారం ఈ కాలంలోనూ, ఐదవ శతాబ్దంలోనూ ఉండే గెటప్, లొకేషన్లతో కథనం నడుస్తుంది. అటవిక జాతులు,వాటి సంఘర్షణలు, ఈ నాటి ప్రపచం ఈ కథలో ముఖ్యాంశంగా ఉందని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. అయినా సురేష్ ప్రొడక్షన్ లో ఈ మధ్య వరసగా కథలు ఓకే అవటం ఆగిపోవటం జరుగుతూనే ఉందని పెద్దగా ఆశ్చర్యపోవల్సిందేమీ లేదని విన్నవారు కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రం ప్లేస్ లోకే గౌతం మీనన్ చిత్రం వచ్చి చేరింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X