గాసిప్స్ కోసం ఆ హీరో స్పెషల్ ఎరేంజిమెంట్స్
సినీ పరిశ్రమలో ఏ హీరో లేదా హీరోయిన్ మీదైనా గాసిప్స్ రాకపోతే క్రేజ్ లేనట్లు...రానట్లు లెక్క.దాంతో క్రేజ్ కోసమైనా గాసిప్స్ రావాలని కోరుకుంటూంటారు. అందుకోసం కొన్ని ప్రెవేట్ ఏజన్సీలు కూడా పనిచేస్తూంటాయి. అయితే ఆ కల్చర్ మన తెలుగు పరిశ్రమలో ఇంకా ప్రవేశించలేదు కానీ ఓ తెలుగు హీరోకి అవసరమైంది.అతనెవరో కాదు రాణా.బాలీవుడ్ లో దమ్ మారో దమ్ చిత్రంతో పరిచయమైన రాణాకి అక్కడ బోల్డు క్రేజ్ వచ్చేసి క్లిక్ అయిపోయి చేతినిండా సినిమాలతో దూసుకుపోతాడని అతని తండ్రి సురేష్ బాబు అనుకున్నారు.
కానీ సీన్ రివర్స్ అయింది. తెలుగు,హిందిలలో ఎక్కడా కొద్దిగా కూడా పేరు రాలేదు. దాంతో తెలుగు కన్నా హిందీమీద ఎక్కువ కాన్సర్టేషన్ చెయ్యాలనుకున్న ఆ తండ్రి తన కొడుకు పై కూడా గాసిప్స్ వస్తే కాస్త అందరి దృష్టిలో పడతాడనే విషయం గుర్తించాడు. సినిమా పరిశ్రమలో ఉన్న సుదీర్ఘ అనుభవంతో ఆయన ఈ పనిని ఓ ప్రెవేట్ ఏజన్సీకి ముంబైలో అప్పగించినట్లు తెలుస్తోంది.అప్పటినుంచి వారు అదే పనిమీద ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం రాణా ...నా ఇష్టం అనే చిత్రంలో నటిస్తున్నారు. సుకుమార్ అశోసియేట్ ప్రకాష్ తోలేటి దర్శకుడుగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని సింహా నిర్మాతలు నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











