twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వర్మ "అప్పలరాజు" డిలే అవటానికి అసలు కారణం?

    By Srikanya
    |

    రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం...అప్పలరాజు కంటిన్యూగా వాయిదాలు పడుతూ వస్తోంది. ఈ చిత్రం వాయిదాపడటానికి కారణం...పోస్ట్ ప్రొడక్షన్ డిలే అని తెలుస్తోంది. అది కూడా ఈ చిత్రం లెంగ్త్ దాదాపు మూడు గంటల ముప్పై నిముషాలు వరకూ వచ్చిందని, దానిని రెండున్నర గంటలకు కుదించాలని కుస్తీ పడుతున్నారని చెప్తున్నారు. అయితే యూనిట్ వారు మాత్రం ఈ చిత్రం విడుదల వాయిదా పడటానకి కారణం కేవలం దియోటర్స్ కొరత అనీ, జై బోలో తెంలగాణా, వస్తాడు నా రాజు చిత్రాలు వరసగా వారం తేడాలో ధియోటర్స్ అన్నీ ఆక్యుపై చేసాయని అందుకే వాయిదా వేస్తున్నామని చెప్తున్నారు.

    ఇక ఈ చిత్రంలో సునీల్ ..అమలాపురం నుంచి హైదరాబాద్ వచ్చి సినిమాని డైరక్ట్ చేసే పాత్రలో కనిపించనున్నాడు. సినిమాను అప్పల్రాజు చూసిన కోణమేమిటి? వాస్తవంలో సినిమా ఏమిటన్నది చిత్రంలో ప్రధానాంశం . రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కిరణ్‌కుమార్‌ కోనేరు నిర్మాత. స్వాతి, సాక్షి హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రంలో తనూరాయ్‌, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, అలీ తదితరులు ఇతర పాత్రధారులు. సంగీతం: కోటి, సమర్పణ: వందిత కోనేరు, సహ నిర్మాత: సుమన్‌వర్మ.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X