పెళ్లి పీటలు ఎక్కుతారనగా బ్రేకప్ .. సిద్ధార్ధ్‌తో సమంతకు ఎక్కడ చెడింది !!

కొన్నాళ్లుగా జరుగుతున్న సస్పెన్స్‌కు తెరదించుతూ బాలీవుడ్ నటి అదితిరావ్ హైదరి మెడలో మూడు ముళ్లు వేశారు సిద్ధార్ధ్. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా పెళ్లిపీటలెక్కి.. ఆ తర్వాత తీరిగ్గా ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టడంతో అభిమానులు, సినీ ప్రముఖులు షాక్ అయ్యారు. సిద్ధార్ధ్ పెళ్లి నేపథ్యంలో ఆయనతో బ్రేక్ చెప్పిన హీరోయిన్లు మరోసారి తెరపైకి వస్తున్నారు. ఈ వివరాల్లోకి వెళితే:

సిద్ధార్ధ్- అదితిలు కొన్నేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్నారు. రేపో మాపో పెళ్లి చేసుకుంటారంటూ ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ ఊహాగానాలుగానే మిగిలిపోయాయి. అలాంటిది గత గత సోమవారం ఉదయం తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని 400 ఏళ్ల చరిత్ర కలిగిన రంగనాథస్వామి ఆలయంలో వీరిద్దరి వివాహం జరిగింది. ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితులు ఈ పెళ్లికి హాజరై వధువరూలను ఆశీర్వదించారు. ఒకప్పుడు వనపర్తి సంస్థానాన్ని పరిపాలించిన రాజ కుటుంబానికి అదితి వారసురాలన్న సంగతి తెలిసిందే. సిద్ధార్ధ్- అదితిలు ప్రస్తుతం హనీమూన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.

Why samantha ruth prabhu Broke Up With Siddharth here s the details

అదితి - సిద్ధార్ధ్‌లకు ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం. సినిమాల్లోకి రాకముందే సత్యదీప్ మిశ్రాను అదితి పెళ్లాడారు. దాదాపు పదేళ్ల పాటు కలిసి కాపురం చేసిన వీరు 2012లో విడిపోయారు. అదితో విడిపోయాక సత్యదీప్.. బాలీవుడ్ నటి నీనా గుప్తా కుమార్తె ముసాబా గుప్తాను వివాహం చేసుకున్నారు. సిద్ధార్ధ్ విషయానికి వస్తే 2003లోనే మేఘన అనే అమ్మాయిని అతను పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు, అయితే వ్యక్తిగత కారణాలతో ఈ జంట విడిపోయింది . 2007లో మేఘన - సిద్ధార్ధ్ విడిపోయారు.

మేఘన నుంచి విడాకులు తీసుకున్న తర్వాత సిద్ధార్ధ్ పలువురు హీరోయిన్లతో ప్రేమాయణం నడిపించాడు. శృతిహాసన్‌తో కొన్నాళ్లు డేటింగ్ చేసిన ఆయన జీవితంలోకి స్టార్ హీరోయిన్ సమంత వచ్చింది. జబర్దస్త్ అనే సినిమాలో నటిస్తున్న సమయంలో సిద్ధార్ధ్ - సమంత ప్రేమలో పడ్డారు. వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని, జాతకంలో దోషాలు పోవడానికి జంటగా పూజలు కూడా నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలు అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి. రేపో మాపో పెళ్లి అనగా సిద్ధార్ధ్ - సమంత విడిపోవడం చిత్ర సీమలో కలకలం రేపింది. ఆ తర్వాత నాగచైతన్యకి దగ్గరైన సమంత ఆయనను ప్రేమించి పెళ్లాడారు, అయితే ఇద్దరి మధ్యా విభేదాలు రావడంతో ఈ జంట విడాకులు తీసుకుంది.

Why samantha ruth prabhu Broke Up With Siddharth here s the details

అయితే సిద్ధార్ధ్‌తో సమంత విడిపోవడానికి అసలు కారణం ఏంటనే దానిపై సోషల్ మీడియాలో రకరకాల కథనాలు తెరపైకి వచ్చాయి. మరో నటితో సిద్ధూ సన్నిహితంగా ఉండటం కైడా ఇద్దరూ విడిపోవడానికి కారణమని వార్తలు వచ్చాయి. ప్రధానంగా హీరోయిన్ దీపతో సిద్ధార్ధ్ పలుమార్లు కనిపించడం చర్చనీయాంశమైంది.

ఓ ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ.. తన జీవితం కూడా సావిత్రి గారి జీవితంలా మారేదని, కానీ తృటిలో తప్పించుకున్నానని చెప్పారు. ప్రేమ విషయంలో ఓసారి తానూ అలాగే నమ్మానని, కానీ లక్కీగా తప్పించుకున్నానని సామ్ తెలిపారు. ఈ వ్యాఖ్యలు సిద్ధార్ధ్ గురించా, లేక నాగచైతన్య గురించా అన్న దానిపై అప్పట్లో రకరకాల కథనాలు వచ్చాయి. ఒకవేళ సిద్ధార్ధ్‌తో కనుక సమంత విడిపోకుండా ఉండి ఉంటే కథ మరోలా ఉండేదని నెటిజన్లు చెబుతున్నారు.

More from Filmibeat

Read more about: samantha ruth prabhu siddharth
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X