సంపత్ నంది అందుకే రవితేజతో అర్జెంటుగా...
హైదరాబాద్ : గత కొంతకాలంగా సంపత్ నంది, పవన్ కళ్యాణ్ ల గబ్బర్ సింగ్ 2 ఉందా లేదా అన్న విషయం హాట్ టాపిక్ గా సినిమా సర్కిల్స్ లో నలుగుతూ వస్తోంది. అయితే రీసెంట్ గా జరిగిన పరిణాలతో ఓ క్లారిటీ వచ్చినట్లైంది. సంపత్ నంది...తను రవితేజతో చిత్రం ఎనౌన్స్ చేసేసాడు. దాంతో అందరికీ గబ్బర్ సింగ్ 2 ని సంపత్ నంది డైరక్ట్ చేయటం లేదని క్లారటీ వచ్చేసింది. ఈ నేపధ్యంలో ఇంత ఇమ్మిడియట్ గా రవితేజతో ఎనౌన్స్ చేయటం వెనక కారణం..డామేజ్ కంట్రోలే అంటున్నారు.
పవన్ తో చిత్రం అనుకుని రెండేళ్లు పాటు స్క్రిప్టు వర్క్ చేసిన సంపత్ దాంతో పవన్ ని ఇంప్రెస్ చేయలేకపోయారనేది స్పష్టం అయ్యింది. దాంతో రచ్చ తర్వాత రెండేళ్లు గ్యాప్ వచ్చేసింది. ఇమ్మీడియట్ గా ప్రాజెక్టు మొదలెట్టినా అది మెటీరియలైజ్ అయ్యేసరికి ఆరు నెలలు పైగానే టైమ్ పడుతుంది. ఈ నేఫధ్యంలో తనపై మీడియాలో..పవన్ చేత రిజెక్టు చేయబడిన డైరక్టర్ అంటూ వార్తలు రాకుండా ఉండేందుకు..రవితేజ తో ప్రాజెక్టు ఎనౌన్స్ చేసాడంటున్నారు.

ఇక..రెండోసారి కిక్‌ని పంచే ప్రయత్నంలో ఉన్నారు రవితేజ. తదుపరి చేయనున్న మరో చిత్రానికి తాజాగా పచ్చ జెండా వూపేశారు. సంపత్ నంది దర్శకత్వంలో ఆ చిత్రం తెరకెక్కబోతోంది. 'కిక్ 2' పూర్తయిన వెంటనే సెట్స్‌పైకి తీసుకెళతారు. ఇందులో రవితేజ సరసన ఇద్దరు హీరోయిన్స్ నటిస్తారు.
రవితేజ మాట్లాడుతూ ''సంపత్ నంది చెప్పిన కథ చాలా బాగుంది. ఒక్కసారి వినగానే ఓకే చెప్పేశా. అన్ని వర్గాల్నీ అలరించే అంశాలున్నాయి. మాస్‌తో పాటు కుటుంబ ప్రేక్షకులకూ నచ్చేలా సంపత్ నంది కథని తీర్చిదిద్దుతున్నాడు''అన్నారు.
''రవితేజతో సినిమా చేయాలన్న కోరిక నెరవేరుతుండటం ఆనందంగా ఉంది. రవితేజ నుంచి ప్రేక్షకులు ఏమేం ఆశిస్తారో అన్నీ ఈ చిత్రంలో ఉంటాయి. సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలు త్వరలో వెల్లడిస్తాము''అన్నారు సంపత్ నంది.


Click it and Unblock the Notifications











