యాక్సిడెంటే శేఖర్ కమ్ముల 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' లేటుకి కారణం
శేఖర్ కమ్ముల,రానా కాంబినేషన్ లో రూపొందిన లీడర్ చిత్రం రిలీజై చాలా కాలం అయింది. అయితే ఇప్పుటివరకూ శేఖర్ తన తర్వాత ప్రాజెక్టు ప్రారంభించలేదు. ఆయన తన తర్వాత ప్రాజెక్టు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని ఆర్టిస్టుల సెలక్షన్,స్క్రిప్టు కూడా పూర్తయిందని ఆ మద్య ప్రకటించారు.అయినా ఎందుకు ప్రారంభం కావటం లేదనేది అభిమానుల్లో ప్రశ్న.కానీ దానికి కారణం ఏమిటీ అంటే..శేఖర్ కమిట్మెంట్ అంటున్నారు.
ఆ కమిట్ మెంట్ ఏమిటీ అంటే ఆయన ఈ చిత్రం కోసం కెమెరామెన్ విజయ్ సి.కుమార్ ని ఎప్పటిలాగే బుక్ చేసుకున్నారు. అయితే ఆయనకు బాలకృష్ణతో చేస్తున్న చిత్రం సమయంలో యాక్సిడెంట్ అయింది. దాంతో ఆయన రెస్ట్ లో ఉన్నారు.శేఖర్ మరో కెమెరామెన్ తో వెళ్ళక అడ్వాన్స్ లుగా ఇచ్చిన డబ్బులు కూడా వదులుకుని ఆ కెమెరామెన్ కోసం ఎదురుచూస్తున్నారు.ఈ విషయం తెలిసిన వారు శేఖర్ కమిట్మెంట్ ని చూసి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.


Click it and Unblock the Notifications











