అందుకా శృతి హాసన్ ని దిల్ రాజు తన సినిమాలోకి..
దిల్ రాజు, సిద్దార్ధ కాంబినేషన్ లో రూపొందనున్న ఓహ్ మై ప్రెండ్ చిత్రంలో హీరోయిన్ గా శృతిహాసన్ ని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే వీరి కాంబినేషన్ లో వచ్చిన 'అనగనగా ఓ ధీరుడు" ఫ్లాప్ అయినా రిపీట్ చేయటమేమిటని ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. అయితే దీనికి కారణం కేవలం సిద్దార్ధ పట్టుదలే అని చెప్తున్నారు. 'అనగనగా ఓ ధీరుడు" చిత్రం షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగటమే దానికి కారణం అని చెప్తున్నారు. అందుకనే తనతో ఎవరు చిత్రం తీయాలన్నా శృతినే తప్పక తీసుకోవాలని రికమెండ్ చేస్తున్నాడు.ఇక ఈ చిత్రానికి 'అలా.. మొదలైంది" హీరోయిన్ నిత్యామీనన్‌ను మొదటి తీసుకున్నాడు.అయితే సిద్ధార్థ్ రంగంలోకి దిగి నిత్యమీనన్ ను తప్పించి శృతి హాసన్‌నే హీరోయిన్‌గా బుక్ చేయించాడు. అయితే శృతి మాత్రం ఈ విషయాన్ని తేలిగ్గా తీసిపారేస్తూ.. అతను మా నాన్నకి, నాకు ఫాన్ అంతే అంతకు మించి ఏమీ లేదు అంటోంది.


Click it and Unblock the Notifications











