అందుకే తప్పుకున్నాడా? పవన్ కళ్యాణ్.. శింబు.. అదే మూవీ, అదే ఇబ్బంది?
కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న 'ఇండియన్ 2'(భారతీయుడు 2) చిత్రం షూటింగ్ నేటి నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ విషయాన్ని ఖరారు చేస్తూ శంకర్ పోస్టర్ సైతం విడుదల చేశారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ దీన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.
ఈ చిత్రంలో శింబు కీలకమైన ప్రాత చేస్తున్నారని గతంలో వార్తలు వచ్చినా... ఇపుడు ఆయన తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. శింబు తప్పుకోవడంతో ఆ స్థానంలో హీరో సిద్ధార్థ్‌ను తీసుకున్నారట. అయితే ఇలాంటి పెద్ద ప్రాజెక్ట్ నుంచి శింబు ఎందుకు తప్పుకున్నారు? అనే విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్. ఈ విషయంలో కొన్ని గాసిప్స్ కూడా వినిపిస్తున్నాయి.

పేమెంట్ విషయంలో విబేధాలేనా?
తెలుగులో హిట్టయిన ‘అత్తారింటికి దారేది' చిత్రాన్ని తమిళంలో శింబు హీరోగా రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని కూడా లైకా ప్రొడక్షన్స్ వారే నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీ విషయంలో తనకు రావాల్సిన రెమ్యూనరేషన్ ఇంకా అందలేదని, ఈ విషయంలో నిర్మాతలు ఇబ్బందులు పెట్టడం వల్లే... లైకా నెక్ట్స్ ప్రాజెక్ట్ ‘ఇండియన్ 2' నుంచి శింబు తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

గతంలో వపన్ కళ్యాణ్‌కు ఇదే ఇబ్బంది
‘అత్తారింటికి దారేది' సినిమా తెలుగులో తీసిననపుడు కూడా పవన్ కళ్యాణ్ నిర్మాతల నుంచి రెమ్యూనరేషన్ సరైన సమయంలో అందక ఇబ్బంది పడ్డారు. నిర్మాతపై ఫిర్యాదు కూడా చేశారు. ఇపుడు అదే సినిమాను తమిళంలో రీమేక్ చేస్తుండటంతో శింబుకు అదే ఇబ్బంది ఎదురైందనే ప్రచారం హాట్ టాపిక్ అయింది.

ఎలాంటి అధికారిక సమాచారం లేదు
అయితే శింబు రెమ్యూనరేషన్ విషయంలో లైకా ప్రొడక్షన్స్ నుంచి ఇబ్బంది ఏర్పడిందని ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. మరో వైపు ఇండియన్ 2లో శింబు లేదా సిద్దార్థ్ ఎంపికైనట్లు కూడా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ లేదు. ఇది కేవలం తమిళ మీడియా వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మాత్రమే.

ఇండియన్ 2
ఇండియన్ 2 విషయానికొస్తే ఈ చిత్రంలో కమల్ హాసన్ సేనాపతి పాత్రలో కనిపించబోతున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్. 1996లో వచ్చిన ‘ఇండియన్' మూవీకి ఏ మాత్రం తగ్గకుండా ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అవినీతి కార్యకలాపాలను ఫోకస్ చేస్తూ ఈ మూవీ ఉంటుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











