ఆ ఇద్దరు హీరోయిన్ల కంటే శ్రీలీల అంత చీపా? పుష్ప 2 ఐటెమ్ సాంగ్ విషయంలో..!
ఇప్పుడు టాలీవుడ్ సినిమా దగ్గర ఉన్నటువంటి టాప్ మోస్ట్ యంగ్ అండ్ స్టార్ హీరోయిన్స్ లో మొట్ట మొదటిగా వినిపించే పేరు శ్రీలీలదే ఉంటుంది. కాగా తెలుగులో డీసెంట్ డెబ్యూ తర్వాత వెను వెంటనే పెద్ద ఆఫర్స్ అందుకోవడానికి ఎక్కువ సమయం కూడా పట్టలేదు. సరే ఇది బాగానే ఉంది తెలుగు సహా హిందీ ఆఫర్స్ కూడా ఈమెకి వచ్చాయి అని టాక్ ఉంది.
అయితే హిందీలో తన డెబ్యూ కొంచెం ఆలస్యం అయ్యింది కానీ శ్రీలీల డిమాండ్ మాత్రం తెలుగులో సహా సౌత్ సినిమా దగ్గర బాగానే ఉందని చెప్పాలి. కాగా ఇపుడు శ్రీలీల ఒక్క హీరోయిన్ గానే కాకుండా ఐటెం భామగా కూడా మారిన సంగతి తెలిసిందే. ఇది వరకు ఎప్పుడు కూడా ఐటెం గర్ల్ గా శ్రీలీల చేయలేదు అని మొట్ట మొదటి సారి మాత్రం పుష్ప రాజ్ కోసం ఐటెం భామగా శ్రీలీల మారింది.

అయితే ఇపుడు ఇండియన్ సినిమా అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న బిగ్గెస్ట్ ఇండియా సినిమా పుష్ప 2 అనే అందరికీ తెలుసు. కాగా ఆ మధ్య స్టార్ట్ అయ్యిన రూమర్స్ ని నిజం చేస్తూ ఎట్టకేలకి మేకర్స్ క్రేజీ అప్డేట్ ని కూడా ఇచ్చేసారు. దీనితో బన్నీతో మొట్ట మొదటిసారిగా శ్రీలీలా జత కట్టడం అధికారికం అయ్యింది. అయితే ఈమె ఈ సినిమా కోసం సాలిడ్ రెమ్యునరేషన్ ని తీసుకున్నట్టుగా తెలుస్తుంది.
సినిమాకి ఈజీ రెండు మూడు కోట్లు తీసుకుంటున్న శ్రీలీల పుష్ప 2 లో ఐటెం సాంగ్ కోసం కూడా బాగానే ఛార్జ్ చేసిందట. కాగా సినీ వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం ఈ సాంగ్ కోసం ఆమె అక్షరాలా కోటి రూపాయల పే చెక్ ని అందుకుంది అని తెలుస్తుంది. దీనితో ఈమెకి బేరాన్ని ఇంతలో తెగ్గొట్టేసారని చెప్పాలి.

కాగా దీనికి ముందు అనుకున్న బాలీవుడ్ భామలు జాన్వీ కపూర్, శ్రద్దా కపూర్ లు చెప్పిన రెమ్యునరేహన్ లు అయితే దీనికి ట్రిపుల్ లెవెల్ దాటే ఉన్నాయని టాక్ ఉంది. దీంతో ఫైనల్ గా చౌక గానే శ్రీలీలలో సెట్ చేసుకొని ఆమెకి పాన్ ఇండియా ఇమేజ్ కి ఒక్క సాంగ్ తో ఇవ్వబోతున్నారని చెప్పొచ్చు. మరి చూడాలి ఈ సాంగ్ ఇద్దరి నడుమ ఏ లెవెల్లో ఉంటుందో ఎవరు ఎవరిని డామినేట్ చేస్తారు అనేది.
ఇక ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ లో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మికా మందన్నా నటించగా ఈమెకి ఈ సినిమా తర్వాత మరింత ఫేమ్ వచ్చేసింది. ఇక ఎన్నో అంచనాలు ఉన్న ఈ సీక్వెల్ ని మేకర్స్ ప్రపంచ వ్యాప్తంగా ఈ డిసెంబర్ 5న తెలుగు, తమిళ్, హిందీ, మలయాళ, కన్నడ సహా బెంగాలీ భాషల్లో కూడా విడుదల చేస్తున్నారు. అలాగే దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తుండగా థమన్ నేపథ్య సంగీతాన్ని అందిస్తున్నట్టుగా తెలుస్తుంది.


Click it and Unblock the Notifications











