సూపర్ స్టార్‌ని దర్శకుడు సురేందర్ రెడ్డి పట్టించుకోక పోవడానికి కారణం
గతంలో ప్రిన్స్ మహేష్‌తో అతిధి అనే సినిమాని తీశారు దర్శకుడు సురేందర్ రెడ్డి. ఈసినిమా తీస్తున్న సమయంలో ప్రిన్స్ మహేష్ తోనే తన తదుపరి సినిమా ఉంటుదని, ఆ సినిమాకి నిర్మాతను కూడా నేనేనని సురేందర్ రెడ్డి ప్రకటించడం జరిగింది. అతిధి సినిమా ప్లాప్ కావడంతో చాలా రోజులు సైలెంట్ అయిపోయినటువంటి సురేందర్ రెడ్డి కిక్ సినిమాతో మళ్శీ లైన్ లోకి వచ్చాడు.
ప్రిన్స్ మహేష్‌తో జేమ్స్ బాండ్ తరహా సినిమా తీస్తానని మహేష్ సోదరి మంజులని కూడా ఒప్పించడం జరిగింది. అలా కధాచర్చలు జరుగుతున్న సమయంలో మంజుల మరీ అత్యంత భారీ బడ్జెజ్ చిత్రం అని అనగానే సురేందర్ రెడ్డికి మంజుల సారీ చెప్పిందని సమాచారం. దాంతో జూ ఎన్టీఆర్ పంచన చేరి, ఎన్టీఆర్‌ని లైన్‌లో పెట్టి ఇప్పుడు ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పేరే రచ్చ. ఇది మాత్రమే కాకుండా తాజాగా కింగ్ నాగార్జునకి కూడా ఓ స్టోరీ లైన్ వినిపించి నాగార్జునతో కూడా సినిమా తీయడానికి సిద్దమయ్యారు సురేందర్ రెడ్డి.
అసలు మహేష్ తో జేమ్స్ బాండ్ తీయాలని అనుకున్న సురేందర్ రెడ్డి సడన్‌గా మహేష్‌ని వదిలేసి ఎన్టీఆర్ పంచన చేరడానికి కారణాలు ఏమై ఉంటాయనేది తెలియడం లేదు. సురేందర్ రెడ్డిపై మహేష్‌కు మంచి ఇంప్రషన్ ఉన్నా మరలా వీరిద్దరు కలసి ఎప్పుడు సినిమా తీస్తారని అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇది ఇలా ఉంటే అల్లు అర్జున్ త్వరలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా లో నటించనున్నాడు.
ఈ చిత్రాన్ని ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సంస్ధకు అనుబంధ సంస్ధ అయిన ఎల్లో ఫ్లవర్స్ సంస్ధ నిర్మించనుంది. మిరపకాయ్ చిత్రంతో రంగ ప్రవేశం చేసిన తమ ద్వితీయ చిత్రాన్ని అల్లు అర్జున్ తో నిర్మించనుంది. రమేష్ పుప్పాల నిర్మాతగా అనిర్మానం కానునన్ ఈ చిత్రానికి ఆర్.ఆర్.మూవీ మేకర్స్ అధినేత వెంకట్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.


Click it and Unblock the Notifications











