twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సునీల్ తో చేయనని రిజెక్టు చేసింది?

    By Srikanya
    |

    సునీల్ కష్టపడి హీరో అయినా అతని ప్రక్కన హీరోయిన్ గా చేయటానికి ఇంకా ముంబై భామలు జంకుతున్నారు. తాజాగా తాప్సీ అతని ప్రక్కన చేయనని చెప్పినట్లు సమాచారం. మొదట ఆమె సునీల్ తో తను వెడ్స్ మను రీమేక్ లో నటిస్తానని కమిటై మళ్ళీ మాట మార్చిందని చెప్తున్నారు. కమెడియన్ అయిన సునీల్ సరసన నటిస్తే టాప్ హీరోల సినిమాల్లో అవకాశాలు రావని, ఇందుకు 'మర్యాద రామన్న'లో నటించిన సలోని మంచి ఉదాహరణంటూ ఆమె హితులు హెచ్చరించారనీ, అందుకే ఆమె ఆ సినిమా చెయ్యట్లేదనీ ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. అయితే తాప్సీ నుంచి మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాలేదు.

    ఇక మాధవన్, కంగనా రనౌత్ జంటగా బాలీవుడ్‌లో వచ్చి సూపర్‌హిట్టయిన చిత్రం'తను వెడ్స్ మను'. ఈ చిత్రం రీమేక్ ని మెగా సూపర్‌గుడ్ ఫిలిమ్స్ పతాకంపై దర్సకుడు దేవీప్రసాద్ చేయనున్నారు. ప్రస్తుతం తెలుగుకి అణుగుణంగా స్క్రిప్టు వర్క్ జరుగుతున్న ఈ చిత్రంకోసం మొదట క్రేజీ హీరోయిన్స్ ని సంప్రదించారు కానీ వారు ఒప్పుకోలేదు. సునీల్ అనేసరికి వారంతా విముఖత చూపించారు.

    ఈ నేపధ్యంలో తాప్సీ ఓకే చేయటంతో అంతా హ్యాపీ ఫీలయ్యారు. కానీ ఆమె కూడా ఇప్పుడు రిజెక్టు చేసిందనే వార్తలు వస్తున్నాయి. ఇక తాప్సీ కెరీర్ కూడా ఏమంత ఆశాజనకంగా లేదు. ఆమె చేసిన సినిమాల్లో 'మిస్టర్ పర్ఫెక్ట్' ఒక్కటే ఆడింది. ఆచిత్రంలో ఆమె సెకెండ్ హీరోయిన్ రోలు కావటంతో పెద్దగా గుర్తింపు రాలేదు. ప్రస్తుతం తాప్సీ..కృష్ణవంశీ దర్శకకత్వంలో గోపిచంద్ సరసన మొగడు చిత్రం చేస్తోంది.

    English summary
    Tapsi has signed a new film. It is super hit Hindi remake film ‘Tanu Weds Manu’ played by Bollywood actress Kangana Ranauth. Sunil is playing lead role in the Telugu version and now Tapsi has joined him for romancing. Ganesh Indukuri will produce this movie under Mega Super Good films banner.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X