పూరీ జగన్నాధ్ ఆఫర్ ని తాప్సీ ఎందుకు రిజెక్ట్ చేసిందంటే...

By Srikanya

ఝుమ్మంది నాదం చిత్రంతో పరిచయం అయి ఆ తర్వాత తెలుగులో బిజీ హీరోయిన్ గా మారిన తాప్సీకి పూరీ జగన్నాధ్ నుంచి ఆఫర్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాప్సీ దానిని రిజెక్టు చేసిందని సమాచారం. మొదట ఆలోచించుకు చెపుతానన్న ఆమె తర్వాత దానిని రిజెక్టు చేసింది.దానికికారణం ఆమె నటించిన తమిళ చిత్రం సంక్రాంతికి విడుదలై పెద్ద విజయం సాధించటమేనని తెలుస్తోంది. పూరికి ఇచ్చే డేట్స్ ని తమిళంలో మరో రెండు చిత్రాలుకు ఇచ్చుకుంటే మేలని ఆమె భావించే ఈ నిర్ణయం తీసుకుందనితెలుస్తోంది.అందులోనూ పూరి రూపొందించే చిత్రం తెలుగు చిత్రం కాదని అమితాబ్ తో పూరి రూపొందించనున్న చిత్రం బుడ్డ ఆఫర్ అది. అలాగే ఆ చిత్రంలో ఆమె సోనూసూద్ సరసన చేయల్సి ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఆమె రిజక్ట్ చేసింది. ఇక ఈ బుడ్డ చిత్రం పిబ్రవరి 23వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అలాగే చిరుత ఫేమ్ నేహాశర్మ కూడా ఈ చిత్రంలో ఓ ప్రధానపాత్ర ఫోషించనుంది. ఇక అమితాబ్ కి జంటగా టబు కనిపించనుంది. ఇంతకు ముందు వీరిద్దరు కాంబినేషన్ లో చీనికామ్ చిత్రం వచ్చి విజయవంతమైంది. ఇక ప్రస్తుతం పూరి జగన్నాధ్...రానా, ఇలియానాలు కాంబినేషన్లో "నేను నా రాక్షసి" చిత్రాన్ని రూపొందిస్తున్నారు. జనవరి నెలాఖరున ఈ చిత్రం విడుదల అయ్యే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X