ఆ కాన్ఫిడెన్స్ తోనే త్రిష జూ ఎన్టీఆర్ ని కాదందా?
ఎన్టీఆర్ సరసన బృందావనం చిత్రంలో హీరోయిన్ గా మొదటి కమిట్ అయి తర్వాత కాదని చెప్పటం తెలిసిందే. అయితే ఈ విషయాన్ని సిని పరిశ్రమలో చాలా మంది సీరియస్ గా ఆలోచిస్తున్నారు. ఎన్టీఆర్,దిల్ రాజు వంటి హేమా హేమీలను కాదనటం వెనక ఆమె ఓవర్ కాన్ఫిడెన్స్ పనిచేసిందా అని అనుమానపడుతున్నారు. ప్రస్తుతం ఆమె హిందీలో ప్రియదర్శన్ డైరక్షన్‌లో 'కట్టా మీటా' చిత్రం త్రిష చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న కారణంగా మరే ఇతర చిత్రాలూ త్రిష అంగీకరించలేదు.'బృందావనం'చిత్రమే కాక ఆ హిందీ చిత్రం రిలీజయ్యే వరకూ మరే దక్షిణాది చిత్రమూ ఒప్పుకోవద్దని ప్రియదర్శన్ ఆమెకు సలహా ఇచ్చినట్లు చెబుతున్నారు.
త్రిష కూడా 'కట్టా మీటా' మీద మంచి నమ్మకం పెట్టుకుందని సమాచారం. ఆ సినిమా తర్వాత వరస బాలీవుడ్ ఆఫర్స్ వచ్చి పడతాయని ఆమె ఊహించే ఈ డెసిషన్ తీసుకుందంటున్నారు. అయితే సినిమా హిట్టయి..హిందీ వారికి ఆమె నచ్చినప్పుడు సంగతి కదా అంటే ఆసిన్ ని ఆమె ఉదాహరణగా చూపిస్తోందిట. అయితే పైకి మాత్రం తను గురువుగా భావించే ప్రియదర్శన్ మాటలకు గౌరవమిస్తున్నట్లు చెపుతోంది. ఇక ఎన్టీఆర్‌తో బృందావనం వదులుకోవడం వలన ఆ అవకాశం కాజల్ అగర్వాల్‌కు చిక్కింది. ఇక వెంకటేష్ తో చేసిన నమో వెంకటేశ చిత్రం సంక్రాంతికి రిలీజ్ కానుంది.


Click it and Unblock the Notifications











