త్రివిక్రమ్ భయపడుతున్నాడా?: అదే జరిగితే బిగ్ డ్యామేజ్.. ట్రైలర్ ఆలస్యం వెనుక?

ఓవైపు సినిమా విడుదల తేదీ దగ్గరపడుతోంది. అయినా ఇంతవరకు అజ్ఞాత‌వాసి ట్రైలర్ రిలీజ్ కాలేదు. కనీసం ఎప్పుడొస్తుంది అనే దానిపై కూడా క్లారిటీ లేదు. బహుశా నేడో.. రేపో.. విడుదల ఖాయమన్న ప్రచారం మాత్రం జరుగుతోంది. నిజానికి ట్రైలర్ ఇప్పటికే కట్ చేసి సిద్దం చేసినప్పటికీ.. రిలీజ్ చేయడానికి మాత్రం దర్శకుడు త్రివిక్రమ్ తటపటాయిస్తున్నారట. ఇంతకీ ఆ కారణమేంటీ..

Recommended Video

ఒకే కధ పై ముగ్గురు దర్శకులా ?

 త్రివిక్రమ్ భయపడుతున్నాడా!:

త్రివిక్రమ్ భయపడుతున్నాడా!:

జెరోం సల్లే అనే డైరెక్టర్ తెరకెక్కించిన 'లార్గో వించ్' సినిమాకు అజ్ఞాత‌వాసి కాపీ అన్న ఆరోపణలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. టీజర్ విడుదల చేసినప్పటి నుంచి ఈ ప్రచారం జోరందుకుంది. అయితే ఇప్పుడు ట్రైలర్ కూడా విడుదలైతే ఆ ప్రచారం మరింత ఊపందుకుంటుందని త్రివిక్రమ్ భయపడుతున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

 ట్రైలర్ వస్తే.. ఆ భయం:

ట్రైలర్ వస్తే.. ఆ భయం:

ట్రైలర్ చూసే సీన్లకు గనుక లార్గో వించ్ తో పోలికలు ఉంటే.. ఈసారి ఇది పక్కా కాపీ అన్న ముద్ర పడిపోవడం ఖాయమంటున్నారు. ఆ భయం వల్లే ట్రైలర్ కట్ చేసి సిద్దంగా ఉంచినా.. విడుదల చేయడానికి మాత్రం త్రివిక్రమ్ ధైర్యం చేయట్లేదట.

 త్రివిక్రమ్ మూడ్‌ను బట్టి..:

త్రివిక్రమ్ మూడ్‌ను బట్టి..:

కాపీ వివాదం సంగతి పక్కనపెడితే.. ఎలాగూ ట్రైలర్ రిలీజ్ చేయక తప్పదు కాబట్టి.. నేడో.. రేపో.. అజ్ఞాత‌వాసి ట్రైలర్ విడుదల చేస్తారని అంటున్నారు. అయితే అది ఏ సమయంలో అన్నది త్రివిక్రమ్ మూడ్‌పై ఆధారపడి ఉంటుందట. ఆయన ఎప్పుడు ఓకె అంటే అప్పుడు యూట్యూబ్ లో ట్రైలర్ దర్శనమిస్తుందన్నమాట.

 ఒకవేళ అదే జరిగితే..:

ఒకవేళ అదే జరిగితే..:

ఒకవేళ ఈ రెండు రోజుల్లో కూడా అజ్ఞాత‌వాసి ట్రైలర్ రిలీజ్ చేయకపోతే.. కాపీ ఆరోపణలకు త్రివిక్రమ్ ఊతమిచ్చినవారవుతారు. బయట వినిపిస్తున్న ఊహాగానాలే నిజమని జనం కూడా నమ్మే అవకాశం లేకపోలేదు. కాబట్టి త్రివిక్రమ్ మరీ ఆలస్యం చేయకుండా ఉంటే ఆయనకే మంచిది అంటున్నారు.

 జెరోం సల్లే వస్తున్నాడా?:

జెరోం సల్లే వస్తున్నాడా?:

మరోవైపు లార్గో వించ్ డైరెక్టర్ జెరోం సల్లె కూడా అజ్ఞాత‌వాసి సినిమా చూడాలనుకుంటున్నట్లు ట్విట్టర్ ద్వారా చెప్పిన సంగతి తెలిసిందే. కాబట్టి ఈ సినిమాను చూడటానికి నిజంగా ఆయన వస్తారా?.. లేక ఆ సినిమా హక్కుల్ని ఇప్పటికే టి-సిరీస్ దక్కించుకుంది కాబట్టి విషయాన్ని వాళ్లే తేలుస్తారా? అన్నది చూడాలి.

 భారీ అంచనాలు:

భారీ అంచనాలు:

హిట్టు, ఫ్లాప్ తో సంబంధం లేకుండా పవన్ కల్యాణ్ సినిమాలకు భారీ ఓపెనింగ్స్ రావడం తెలిసిందే. కాబట్టి తాజా అజ్ఞాత‌వాసి సినిమాకు కూడా ఈసారి భారీ ఓపెనింగ్స్ ఖాయమంటున్నారు. ఇప్పటికే అభిమానులంతా ఎప్పుడెప్పుడు ఆన్ లైన్ లో టికెట్స్ పెడుతారా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X