బ్యాంకాక్ కు వరుణ్ సందేశ్ ఎస్కేప్ !?
వరుణ్ సందేశ్ రీసెంట్ గా డ్రగ్ స్కామ్ లో ఇరుక్కున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో మీడియా మొత్తం వరుణ్ సందేశ్ ఏక్టివిటీస్ పైనే కన్నేసి ఉంచింది.ఈ నేపధ్యంలో వరుణ్ సందేశ్ వారినుంచి తప్పుకోవటానికి బ్యాంకాక్ ప్రయాణం పెట్టుకున్నాడని అంతటా వినపడుతోంది.వరుణ్ సందేశ్ ప్రస్తుతం చేస్తున్న ప్రియుడు చిత్రం నిమిత్తం వరుణ్ సందేశ్ బ్యాంకాక్ కి వెళ్థున్నానని,అక్కడో పాట చిత్రీకరణ ఉందని చెప్తున్నారు.అలాగే యూనిట్ సభ్యులు కూడా ఇదంతా వరుణ్ సందేశ్ ఈ డ్రగ్ గొడవలో ఇరుక్కోకముందు అనుకున్న ప్లానింగ్ అంటున్నారు.
ఇప్పుడు హఠాత్తుగా ఎస్కేప్ అవ్వటం లేదని వివరణ ఇస్తున్నారు.నిజము ఏదో కానీ..మీడియాకు మాత్రం వరుణ్ సందేశ్ దూరంగా ఉండాలనుకుంటున్నాడనేది మాత్రం నిజం.చిన్న విషయాన్ని పెద్దది చేసి చిలువలు పలువలుగా కథనాలు అల్లి తమను రోడ్డు మీద పెడుతున్నారని సినీ స్టార్స్ ఇప్పటికే వాపోతున్నారు.తమ టీఆర్పీలు పెంచుకోవటం కోసం సెలబ్రేటీల పర్శనల్ జీవితాలను బలిచేస్తున్నారని,వార్తను కన్ఫర్మ్ చేసుకోకుండా నిరాధారంగా వార్తలను ప్రసారం చేస్తున్నారని ప్రతీ సెలబ్రేటీ గోలెత్తిపోతున్నారు.ఈ నేపధ్యంలో వరుణ్ సందేశ్ ..బ్యాంకాక్ ప్రయాణం ఆసక్తికర పరిణామమే.


Click it and Unblock the Notifications











