twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగబాబు కొడుకు లాంచింగ్ లేటు కి కారణం..మెగా హీరోలే??

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఇప్పుడు పరిశ్రమలో అందరి దృష్టీ నాగబాబు కుమారుడు వరుణ్ తేజ పైనే ఉంది. స్టైలిష్ లుక్ తో ప్రామిసింగ్ గా ఉన్న ఈ కుర్రాడు త్వరలో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో లాంచ్ కాబోతున్నాడు. అయితే ఈ లాంచింగ్ లేటు అవుతోంది. ఇప్పటికే మార్చి 14న ప్రారంభోత్సవం జరుగుతుందని వార్తలు వచ్చాయి. మరో ప్రక్క ఆ సినిమాకు సంభందించిన వారు అదేమీకాదని ఖండించారు.

    ఈ నేపధ్యంలో ఈ చిత్రం లాంచింగ్ కు లేట్ కు అసలు కారణం మెగా హీరోలే అని తెలుస్తోంది. ఓపినింగ్ రోజున వారందరనీ ఒకే వేదికపై తీసుకువచ్చి ఆశీస్సులు ఇప్పించాలంటే వారంతా బిజీ షెడ్యూల్స్ తో ఉన్నారు. అందరి షెడ్యూల్స్ సరిచూసి..వారి ఎవైలబులిటీని బట్టి ఓపినింగ్ ఘనంగా చేద్దామని నాగబాబు ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. ఈ చిత్రం టైటిల్ గొల్లభామ అని ప్రచారంలో ఉంది.

    ఇక వరుణ్ తేజని అశ్వనీదత్ లాంచ్ చేస్తాడని వినపడుతోంది. అశ్వనీదత్ ది గోల్డెన్ హ్యాండ్ అని,ఆయన బ్యానర్ ద్వారా లాంచ్ అయితే కెరిర్ లో సెటిల్ అవ్వచ్చనే ఓ స్ట్రాటజీతో ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో అశ్వనీద్ తన బ్యానర్ ద్వారా మహేష్ బాబు, రామ్ చరణ్ తేజలను పరిచయం చేసారు. మహేష్ తో రాజకుమారుడు, రామ్ చరణ్ తో చిరతగా ఆ చిత్రాలు భాక్సాఫీస్ లను పలకరించాయి. సినిమా రిజల్ట్ లు యావరేజ్ గా ఉన్నా వారు మాత్రం స్టార్స్ గా సెటిల్ అయ్యిపోయారు.

    మరో ప్రక్క పవన్ కళ్యాణ్ కూడా వరుణ్ తేజ భాధ్యతను భుజాన వేసుకున్నట్లు చెప్తున్నారు. వాస్తవానికి 2009లోనే రవిబాబు 'నచ్చావులే' సినిమా ద్వారా వరుణ్‌తేజ్‌ హీరోగా ఎంటర్‌ అవ్వాల్సి ఉంది. అయితే కొన్ని కార ణాల వల్ల ఈ ప్రాజెక్టు వరుణ్‌ తేజకు ఓకే కాలేదు. తర్వాత 2009, 2010లో ఇందు కు సంబం ధించిన ప్రయ త్నాలు జరి గినా... మెగా ఫ్యామిలీ అంతా అప్పుడు రాజకీ యాల్లో బిజీబిజీగా గడపడం, 2011లో ప్రజారాజ్యం విలీనంతో ఈ విషయాన్ని పక్కన పెట్టారు. ఇప్పుడు అంతా సర్దుకోవడంతో మళ్లీ వరుణ్‌తేజ్‌ హీరోగా ఎంట్రీ విషయం దృష్టి పెట్టారు.

    English summary
    Nagababu son Varun Tej is going debut soon on silver screen. Srikanth Addala who is driving high on success of SVSC will direct Varun Tej debut movie.It has become sentiment for Mega Heroes after Allu Arjun,Charan and now Varun Tej was introducing by Aswini Dutt.The film is titled as ‘Gollabhama’ and it is said to be Romantic love story. Cast and Crew of Gollabhama will be announced soon.The makers were yet to finalize a suitable date, so that all the Mega heroes will be available.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X