రామ్ చరణ్ డామినేషన్, అందుకే వెంకీ ఔట్?

By Bojja Kumar

Venkatesh-Ram Charan
హైదరాబాద్: విక్టరీ వెంకటేష్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి కృష్ణ వంశీ దర్శకత్వంలో మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నారనగానే ఇరు వర్గాల అభిమానులు, ఫ్యామిలీ ప్రేక్షకులు భవిష్యత్‌లో మంచి సినిమా చూడబోతున్నాం అని సంబర పడ్డారు. అయితే ఉన్నట్టుండి ఇటీవల ఈ సినిమా నుంచి వెంకటేష్ తప్పుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి.

కలిసి పని చేద్దామనుకున్న వెంకటేష్-రామ్ చరణ్ ఎందుకు విడిపోయారు? అనేది ఎవరికీ అంతు పట్టడం లేదు. తాజాగా ఫిల్మ్ నగర్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో తన పాత్ర నచ్చకనే వెంకటేష్ తప్పుకున్నట్లు స్పష్టమవుతోంది. తొలుత తనకు చెప్పిన స్టోరీ లైన్‌కు, స్క్రిప్టు రెడీ చేస్తున్న తీరు వేరుగా ఉందని, సినిమా మొత్తం రామ్ చరణ్ పాత్ర డామినేషన్ ఉందని, తన పాత్రలో నెగెటివ్ షేడ్స్ ఉండటం వెంకీకి నచ్చలేదని అంటున్నారు.

ఇప్పటికే 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో నటించిన వెంకటేష్‌కు....పాత్ర పరంగా మహేష్ బాబుకంటే తక్కువ మార్కులే పడ్డాయి. మరో వైపు ఇటీవల విడుదలైన మరో మల్టీస్టారర్ చిత్రం 'మసాలా'లో కూడా వెంకీకి పెద్దగా పేరు రాలేదు. ఈ నేపథ్యంలో తాను మళ్లీ అలాంటి పాత్రలే చేసుకుంటూ వెళితే..సినిమాలు హిట్టయినా, తన కెరీర్ మరింత దెబ్బతింటుందని వెంకటేష్ ఆలోచనలో పడ్డాడని, అందుకే ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X