వెంకటేష్ 'సావిత్రి' ఆగిన కారణం
వెంకటేష్, తేజ కాంబినేషన్ లో ప్లాన్ చేసిన 'సావిత్రి' చిత్రం అర్దాంతరంగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఓపినింగ్ కూడా జరిగిన ఈ చిత్రం ఎందుకు ఆగిందనేది అబిమానుల్లో ప్రశ్నగా మిగిలిపోయింది. అయితే పిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్న సమాచారం ప్రకారం సావిత్రి చిత్ర కథ..త్వరలో విడుదల కానున్న విక్రమ్ నాన్న కథకు పోలిక ఉండటంతో ఆగిపోయిందని తెలుస్తోంది. సావిత్రిలోనూ వెంకటేష్ పాత్రను మానసికంగా ఎదగని పాత్రగా మలచటం,విక్రమ్ నాన్న లోనూ అదే జరగటం తో సినిమాని ఆపుచేయటం మేలనే నిర్ణయానికి సురేష్ బాబు వచ్చాడని టాక్. ఇక నాన్న చిత్రం హాలీవుడ్ చిత్రం ఐయామ్ శామ్ ఆధారంగా రూపొందిందిని అంతటా వినిపిస్తోంది. ఇక నాన్న చిత్రంలో అనూష్క లాయిర్ గా కనిపించనుంది.


Click it and Unblock the Notifications











