పవన్ నుంచి చరణ్ కి టాప్ డైరక్టర్స్ జంప్ ఎందుకు?
హైదరాబాద్ : టాప్ డైరక్టర్స్ వినాయిక్,శ్రీను వైట్ల ఇద్దరూ పవన్ కోసం ట్రై చేసి చరణ్ తో ముందుకు వెళ్లటం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. చరణ్ తో తాజాగా శ్రీను వైట్ల చిత్రం ఖరారు అయిన నేపధ్యంలో ఈ టాపిక్ హాట్ గా మారింది. ఇంతనకు ముందు వినాయక్ ..పవన్ కోసం ఓ కథ రెడీ చేసి వినిపించాడని,అయితే ఓకే చేయలేదని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత చరణ్ తో వినాయిక్...నాయిక్ చిత్రం ప్రారంభించారు. ఇప్పుడు శ్రీను వైట్ల తన బాద్షా చిత్రం తర్వాత అంతా పవన్ తో చేస్తారనుకున్నారు. అయితే హఠాత్తుగా అశ్వనీదత్ నిర్మాతగా చరణ్ సినిమా సీన్ లోకి వచ్చింది. నిజానికి శ్రీను వైట్ల తాను ..పవన్ తో చేయాలని ఓపెన్ గా స్టేజిపై చెప్పారు.
అయితే దీనికి కారణం ఏమిటి అనేది సీనియర్స్ చర్చించుకుంటున్నారు. వారు అనేదాని ప్రకారం పవన్ తో సినిమా ఫలానా డైరక్టర్ చేయాలనుకోవటం వల్ల ప్రాజెక్టు మెటీరియలైజ్ కాదని, కేవలం పవన్.. ఫలానా దర్శకుడుతో చేద్దామనుకుంటేనే ముందుకు వెళుతుంది అంటున్నారు. అంటే ఫలానా దర్శకుడుతో తాను చేస్తానని పవన్ ఆ దర్శకుడుకి చెప్పి తనకు కావాల్సిన కథ తయారు చేయించుకుని సినిమాలు చేస్తూంటడాని అందుకే శ్రీను వైట్ల, వినాయిక్ లకు నో చెప్పాడని వినపడుతోంది. అయితే ఇది ఎంతవరకూ నిజమనేది పవనే చెప్పాలి.
ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్..కెమెరా మెన్ గంగతో రాంబాబు చిత్రం బిజిలో ఉన్నారు. ఆ చిత్రం అనంతరం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చిత్రం చేయనున్నారు. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మరో చిత్రం నిర్మించటానికి ప్రోడ్యూసర్ బీవీయస్‌యన్ ప్రసాద్ సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన మీడియాతో మాట్లాడుతూ..'' సెప్టెంబరు నుంచి పవన్‌కళ్యాన్‌తో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా మొదలవుతుంది. దాదాపుగా అందరు హీరోలనూ, ప్రముఖ దర్శకులతోనూ సినిమాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అన్నారు.
పవన్ కళ్యాణ్,త్రివిక్రమ్ కాంబినేషన్ లో గతంలో జల్సా సినిమా వచ్చి విజయవంతం అయ్యింది. తాజాగా మరో సినిమా తెరకెక్కనుంది. ఈ విషయమై త్రివిక్రమ్ శ్రీనివాస్ మీడియాకు కన్పర్మ్ చేసి చెప్పారు. ఆ సినిమా ఎలా ఉంటుందో ఆయన మాట్లాడుతూ...నువ్వు నాకు నచ్చావు తరహా మానవ సంభంధాలతో ఉంటుందన్నారు.అలాగే తెలుగు సంప్రదాయలు,మానవ భాంధవ్యాలు ప్రధానంగా ఇందులో కనిపించేలా కథను రెడీ చేస్తున్నానని చెప్పారు. ప్రస్తుతం పవన్ చేస్తున్న కెమెరామెన్ గంగతో రాంబాబు అనంతరం ఈ చిత్రం ప్రారంభం అవుతుంది.


Click it and Unblock the Notifications











