అఖిల్- శ్రీయ.. బ్రేకప్ కు అక్కడ గొడవ పడటమే కారణం?ఆ తర్వాతే బై ...
అఖిల్ బ్రేకప్ ..ఎయిర్ పోర్ట్ లో జరిగిందంటూ మరో న్యూస్ బయిటకు వచ్చింది.
హైదరాబాద్: అక్కినేని అఖిల్, శ్రీయ భూపాల్‌ల పెళ్లి క్యాన్సిల్ అయిందన్న వార్త నిన్నటి నుంచి సంచలనంగా నిలిచిన సంగతి తెలిసిందే. నిజానికి మీడియావాళ్లకు ఈ బ్రేకప్ న్యూస్ లేటుగా వచ్చిందిట. అఖిల్, శ్రియ మధ్య బ్రేకప్ ఎప్పుడో జరిగిపోయిందని తెలుస్తోంది. మూడేళ్లుగా డేటింగ్ లో ఉన్న ఈ జంట విడిపోవటానికి స్ఫష్టమైన కారణం తెలియరాలేదు కానీ చిన్న వివాదం ఈ బ్రేకప్ కు కారణమైందని తెలుస్తోంది.
అఖిల్, శ్రీయల మధ్య హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో గొడవ జరిగినట్టు తెలుస్తోంది. రోమ్‌లో పెళ్లి ఏర్పాట్లు చేసేందుకు నెల రోజుల క్రితం అఖిల్, శ్రీయ, ఆమె తల్లి బయల్దేరాట. అయితే ఎయిర్‌పోర్ట్‌లోనే అఖిల్, శ్రీయల మధ్య విభేదాలు తలెత్తాయని చెప్పుకుంటున్నారు.

అక్కడే బహిరంగంగా వాదనకు దిగారని చెప్తున్నారు. వాదన అనంతరం శ్రీయను, ఆమె తల్లిని అక్కడే వదిలేసి, గుడ్‌బై చెప్పేసి అఖిల్ ఇంటికి వెళ్లిపోయాడట. వారిద్దరూ అఖిల్‌ను వారించే ప్రయత్నం కూడా చేయలేదట. ఆ తర్వాత అఖిల్‌ను, శ్రీయను కలిపేందుకు నాగ్ ఎంతగా ప్రయత్నించినా కుదరలేదట. దీంతో చేసిది లేక నాగ్ సైలెంట్ అయిపోయాడని మీడియాలో వార్తలు వస్తున్నాయి.
అంతేకాకుండా... ఈ పెళ్లి నాగార్జునకు మొదట్నుంచీ ఇష్టం లేదట. తన కన్నా చిన్న (అఖిల్ ఏజ్ 22 ఏళ్లు)లో, వయసులో పెద్దయిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదని అఖిల్‌కు నాగ్ ఎంతగానో నచ్చ చెప్పినా ఫలితం లేదుట. అంతేకాకుండా అఖిల్ సోదరుడు.... చైతన్య కూడా వారించాడట. అయినప్పటికీ అఖిల్ వినకుండా పట్టుపడ్డటంతో . ఓకే చెప్పేసిందట అక్కినేని కుటుంబం. అయితే అది మూన్నాళ్ల ముచ్చటగానే సాగింది.
దాంతో అఖిల్ పెళ్లి రద్దు వార్త వినిపించడంతో ఏం జరిగి ఉంటుందనే దానిపై రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అఖిల్, శ్రియ మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయనీ, డెస్టినేషన వెడ్డింగ్ ఏర్పాట్ల విషయంలో తేడాలొచ్చాయనీ వినిపిస్తోంది. ఏదేమైనా ఈ వ్యవహారంతో నాగార్జున బాగా కలత చెందినట్లు సినీ వర్గాలు అంటున్నాయి.
ఈ విషయమై నాగార్జున చాలా ఫీలయ్యారని, వెంటనే తన పనులన్ని ప్రక్కన పెట్టిన ఆయన ...తమ రెండు కుటుంబాల పెద్దలు, అఖిల్, శ్రియ కూర్చొని మాట్లాడుకుని, సమస్యను పరిష్కరించుకుందామని అటు వైపు వారికి నాగార్జున సూచించారని తెలుస్తోంది. అయితే ..., అటు నుంచి ఎటువంటి స్పందన రాలేదంటున్నారు.
అఖిల్ సైతం ఊహించని ఈ సంఘటనపై చాలా బాధగా ఉన్నారని, ఎవరితోనూ మాట్లాడేందుకు ఇష్టపడటం లేదని, బాగా సన్నిహితులు అనుకున్న స్నేహితులతో సైతం ఈ విషయం చర్చించటానికి ఇష్టపడటం లేదని సమాచారం. ముఖ్యంగా ఈ విషయమై రెండు కుటుంబాలలోని అధికారికంగా మాట్లాడేందుకు ఎవరూ ముందుకు రావట్లేదు. మీడియావారు ఈ విషయమై స్పందన తెలుసుకునేందుకు ప్రయత్నించినా అది సాద్యం కావటం లేదు. ఆంతరంగికంగా మాత్రం వివాహం రద్దు విషయాన్ని ఇరు కుటుంబాలూ తెలియజేస్తున్నాయి.
ప్రముఖ వ్యాపారవేత్త జీవీకే రెడ్డి మనవరాలైన శ్రియా భూపాల్‌తో 2016 డిసెంబర్‌లో అఖిల్ నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. తేదీ ప్రకటించకపోయినా.. ఈ వేసవిలోనే రోమ్(ఇటలీ)లో ఘనంగా పెళ్లి చేయడానికి ఏర్పాట్లు జరిగాయి. అతిథులకు టిక్కెట్లను కూడా బుక్ చేశారు. అయితే అనూహ్యంగా.. ఈ ఇలా రద్దైనట్లు వార్తలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











