»   »  అక్కడ మీరా జాస్మిన్ కి పనేముంది

అక్కడ మీరా జాస్మిన్ కి పనేముంది

Posted By:
Subscribe to Filmibeat Telugu
Meera Jasmine
అవును...నిజమే సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమాలలో హీరోయిన్ కి పనేముంటుంది. కెమేరాలకు ఫోజులివ్వడం తప్ప ఆమె చేసేదేముంటుంది.అందుకే పిలవలేదు. అయినా పిలిస్తే ఆమె గొంతమ్మ కోరికలు తీర్చాలి. ఖర్చు తడిసి మోపెడంత అవుతుంది. ఆమె డిమాండ్లు తట్టుకోలేకే డైరెక్ట్‌గా సెకెండ్ షెడ్యూల్‌కి రమ్మని చెప్పామంటున్నారు మీరాజాస్మిన్‌తో చిత్రాన్ని నిర్మిస్తున్న రాజ్ కంబైన్స్ నిర్మాతలు సైలెంటుగా.

బుధవారం ప్రారంభమైన ఒకటి నాలుగు చిత్రం ప్రారంభోత్సవంలో ఈ సంఘటన జరిగింది. ఆ సినిమాలో మీరాదే లీడ్ రోల్. కథంతా ఆమె చుట్టూ నడుస్తుంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రం అని రాష్ట్రమంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలవగానే వచ్చారు. ఆమె రాగానే, హీరోయిన్ ఏదీ అనడిగితే... ఆమె బిజీగా ఉండి రాలేకపోయారని సర్ది చెప్పారు. కాని అనుమానం వచ్చిన మీడియా మిత్రులు వదలలేదు. ఇదే విషయమై వారిన గుచ్చిగుచ్చి అడిగారు. అప్పుడు ఆ నిర్మాతలు మీకు తెలియందేముంది ...ఆమె కనుక ఆమె వస్తే.. ఆమెతోపాటు మరికొంతమందికి ఫైట్ టిక్కెట్లు... స్టార్ హోటల్ ఫెసిలిటీలు.... కల్పించాలి కదా. అయినా ఆమె వచ్చి చేసేదేముంది... కెమేరాలకు ఫోజులివ్వడం మినహా అని బయిట పడ్డారు.

కరెక్టే దీన్నే ఆర్ధిక శాస్త్రంలో అనుత్పాదక వ్యయం అంటారు .అంటే ఉత్పత్తి నివ్వని వ్యయం అన్నమాట.కాని ఆమె అటెండయ్యి కెమేరాలకు ఫోజులిచ్చినా ఎంత ఫ్రీ పబ్లిసిటి. ప్రచారమే కదా సినిమా వ్యాపారంలో ప్రథాన అంశం.అయినా ఆమెను అడ్డం పెట్టుకుని సినిమా తీసి సంపాదించాలను కునే వాళ్ళు ఈ ఖర్చు ని పెట్టుబడిగా భావించాలి అంటున్నారు ఈ విషయం తెల్సినవాళ్ళు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X