రామ్ గోపాల్ వర్మ ద్వారా ఐష్ రీఎంట్రీ!
రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో వచ్చిన 'సర్కార్', 'సర్కార్‌రాజ్' సినిమాలు మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాలకు కొనసాగింపుగా వర్మ 'సర్కార్-3'ని తెరకెక్కించే పనిలో వున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తయిందని, ఈ చిత్రం ద్వారానే ఐశ్వర్యారాయ్ రీ ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం.
'సర్కార్‌రాజ్'లో అభిషేక్ బచ్చన్‌కు జోడీగా ఐష్ కనిపించింది. థర్డ్ సీక్వెల్ లోనూ ఐశ్వర్య అదేపాత్రలో కనిపిస్తుందని, బిగ్ బి అమితాబ్ కీలక పాత్రలో నటించనున్న ఈ సినిమాలో ఆయన మనవడిగా రణబీర్‌కపూర్ నటించనున్నట్లు తెలుస్తోంది. అమితాబ్‌తో కలిసి రణబీర్ నటిస్తున్న తొలి చిత్రమిదే.
పాపాయికి జన్మనిచ్చిన ఐశ్వర్యారాయ్ మాతృత్వపు అనుభూతిని ఆస్వాదిస్తూ గత కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా వుంటోంది. ప్రెగ్సెన్సీ తర్వాత ఐష్ శరీరాకృతి మారిపోయింది, ఇక సినిమాల్లో నటించడం కష్టమే అంటూ ఐశ్వర్యారాయ్ పునరాగమనంపై బాలీవుడ్‌లో భిన్నమైన కథనాలు వినిపించాయి.
ఈ నేపథ్యంలో నిరాశలో కూరుకుపోయిన ఆమె అభిమానలకు వర్మ 'సర్కార్ 3' సినిమా రూపంలో ఆమె రీ ఎంట్రీ విషయం విని ఆనందంతో పొంగి పోతున్నారు. త్వరలోనే సర్కార్ 3 విషయాలను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











