Bigg Boss Telugu 9: నాగార్జున ఔట్ .. బిగ్‌బాస్ 9 హోస్ట్‌గా మరో స్టార్ హీరో!
దేశంలో ఎన్ని రియాలిటీ షోలు ఉన్నా బిగ్‌బాస్ క్రేజే వేరు. హాలీవుడ్‌లో మొదలైన ఈ కాన్సెప్ట్ మనదేశంలో తొలుత హిందీలో ప్రారంభమై ఇప్పుడు అన్ని భాషలకు పాకింది. విభిన్న వ్యక్తిత్వాలు, మనస్తత్వం ఉన్న వారిని నాలుగు గోడల మధ్య దాదాపు 100 రోజులకు పైగా ఉంచి గేమ్స్, టాస్క్‌లతో నిర్వహించి ప్రేక్షకులకు వినోదాన్ని పంచడమే బిగ్‌బాస్ కాన్సెప్ట్. బాలీవుడ్ నుంచి అన్ని వుడ్‌లకు పాకిన బిగ్‌బాస్.. తెలుగులో మాత్రం విక్టరీ కొట్టింది. ఈ భాషలోనూ లేనివిధంగా టీఆర్పీలు పగిలిపోయిన చరిత్ర తెలుగు సొంతం.
బిగ్‌బాస్ తెలుగులో ఇప్పటి వరకు 8 సీజన్లు పూర్తయ్యాయి. గతేడాది జరిగిన బిగ్‌బాస్ తెలుగు 8వ సీజన్‌లో గౌతమ్ కృష్ణ - నిఖిల్ మలియాక్కల్ తలపడగా .. నిఖిల్‌ను అదృష్టం వరించి అతను విజేతగా నిలిచాడు. బిగ్‌బాస్ అంటేనే వివాదాలమయం .. గత తెలుగు సీజన్‌లో నలుగురు కన్నడ నటులను కంటెస్టెంట్స్‌గా తీసుకోవడంతో పాటు టైటిల్‌ను కూడా వారికే అప్పగించడంపై అనేక విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ నిర్వాహకులు ఏమాత్రం పట్టించుకోలేదు.

బిగ్‌బాస్‌లో అశ్లీలత పెరుగుతోందని.. పెళ్లికాని స్త్రీ, పురుషులను ఒకే గదిలో , ఒకే బెడ్‌పై రోజుల తరబడి ఉంచడం మంచిది కాదని సాంప్రదాయవాదులు మండిపడుతూనే ఉన్నారు. సీపీఐ నారాయణ వంటి వారైతే బిగ్‌బాస్‌ను టార్గెట్ చేసుకుని తరచుగా సంచలన కామెంట్స్ చేసేవారు. కొందరైతే బిగ్‌బాస్‌ను నిలిపివేయాలంటూ ఏకంగా కోర్టులను సైతం ఆశ్రయించారు. అయినప్పటికీ ప్రజలు మాత్రం బిగ్‌బాస్ షోను ఎంజాయ్ చేస్తున్నారు.
గత సీజన్ ముగిసిందో లేదో అప్పుడే బిగ్‌బాస్ తెలుగు 8 గురించి జనం డిస్కషన్ మొదలుపెట్టారు. ఈసారి కంటెస్టెంట్స్ ఎవరు? ఈసారి సీజన్ ఎప్పుడు ప్రారంభం కానుంది? అంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అలాగే గాసిప్స్ కూడా వైరల్ అవ్వడం మొదలైంది. ఎప్పుడు బిగ్‌బాస్ సీజన్ ప్రారంభమవుతున్నా ఖచ్చితంగా హోస్ట్ గురించి డిస్కషన్ కామన్. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 1ని ఎన్టీఆర్, సీజన్‌ని నాని హోస్ట్ చేయగా.. మిగిలిన ఆరు సీజన్‌లకు కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించారు. నాగార్జున అంటే బిగ్‌బాస్.. బిగ్‌బాస్ అంటే నాగార్జున అన్నంతగా ఆయన ముద్ర వేశారు.
స్టైలీష్‌గా ఎపిసోడ్‌ను నడుపుకుంటూ అలవోకగా చేసేస్తారు నాగ్. అందుకే హోస్ట్‌గా ఆయన తప్పించి మరొకరిని ప్రేక్షకులు ఊహించలేరు. బిగ్‌బాస్‌ను రోజూ మిస్ అయినా.. నాగార్జున ఎంట్రీ ఇచ్చే శని, ఆదివారాలు మాత్రం ఇంటిల్లిపాది ఆయన కోసం వెయిట్ చేస్తుంటారు. కంటెస్టెంట్స్ చేసిన తప్పొప్పులను విశ్లేషించి వారిని ప్రోత్సహిస్తూ షోను రక్తి కట్టించేవారు. ఇక వయసులో పెద్ద కావడంతో పాటు టాలీవుడ్‌ని శాసించే సూపర్‌స్టార్ కావడంతో ఆయన ఎలాంటి వారినైనా కంట్రోల్ చేయగలరనే ముద్ర పడిపోయింది.

ప్రతిసారి సీజన్ ప్రారంభానికి ముందు నాగార్జున హోస్టింగ్ చేయరని? ఆయన ప్లేస్‌లో మరొకరు హోస్ట్‌గా వస్తారని రకరకాల కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యేవి. తీరా ప్రోమోలో నాగ్ కనిపించడంతో అందరి నోళ్లూ మూతపడేవి. తాజాగా బిగ్‌బాస్ తెలుగు 9 ప్రారంభం కాకముందే ఈ సీజన్‌కు నాగార్జున హోస్టింగ్ చేయడం లేదంటూ అప్పూడే గాసిప్స్ మొదలయ్యాయి. బిగ్‌బాస్ తెలుగు 9 కోసం అప్పుడే కంటెస్టెంట్ల కోసం స్టార్ మా హంటింగ్ ప్రారంభించిందట. అలాగే గత సీజన్‌లో పేరున్న సెలబ్రెటీలు లేకపోవడంతో షో కాస్త డల్‌గా మారిందని భావించిన నిర్వాహకులు ఈసారి అలాంటి తప్పులు చేయొద్దని నిర్ణయించుకున్నారు.
ఇక నాగార్జునకు బదులుగా మరో స్టార్‌ని హోస్ట్‌గా ఎంపిక చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో కొందరు స్టార్స్ పేర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, విజయ్ దేవరకొండల పేర్లు వినిపిస్తున్నాయి. ఆహాలో అన్‌స్టాపబుల్ షోని సక్సెస్ చేసిన బాలయ్య .. బిగ్‌బాస్‌కు హోస్టింగ్ చేస్తే బాక్స్‌లు బద్ధలేనని నెటిజన్లు అంటుంటారు. ఇక విజయ్‌కు యూత్‌లో ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా ఈసారి ఆయనను కన్ఫర్మ్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. కళ్లు చెదిరే రెమ్యునరేషన్ ఆఫర్ చేయడంతో విజయ్ దేవరకొండ .. బిగ్‌బాస్ హోస్టింగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా గాసిప్స్ వైరల్ అయ్యాయి. మరి బాలయ్య, విజయ్‌లలో ఎవరు హోస్టింగ్‌కు రానున్నారు? లేక నాగార్జుననే కంటిన్యూ చేస్తారా అన్న దానికి త్వరలోనే క్లారిటీ రానుంది.


Click it and Unblock the Notifications











