అల్లు అర్జున్, సుకుమార్ మధ్య విభేదాలు.. పుష్ప 2 మరోసారి వాయిదా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప: ది రైజ్ చిత్రం భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా దేశవ్యాప్తంగా ఓ ట్రెండ్ క్రియేట్ చేసింది. అలాంటి చిత్రానికి సీక్వెల్ అంటే అంచనాలు రెండు, మూడింతలు పెరిగిపోతాయి. కానీ అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడటం ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురి చేస్తున్నది. అయితే తాజాగా సోషల్ మీడియాలో వస్తున్న కథనాలతో పుష్ప మరోసారి వాయిదా పడొచ్చని అనే వార్త వైరల్ అవుతున్నది. ఆ వివరాల్లోకి వెళితే..

పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ గెటప్ ఆ క్యారెక్టర్‌ను బాగా ఎలివేట్ చేసింది. అయితే తాజాగా అల్లు అర్జున్ గెడ్డం ట్రిమ్ చేసిన లుక్‌తో ఫ్లయిట్‌లో కనిపించారు. అయితే క్యారెక్టర్ కంటిన్యూటీకి కావాల్సిన లుక్ తీసేయడంతో అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి.

Will Allu Arjun s Pushpa 2 postponed Again Here is the reasons

ఇదిలా ఉండగా, ఓ అవార్డుల ఫంక్షన్‌లో దేవీ శ్రీ ప్రసాద్ మాట్లాడుతూ.. దర్శకుడు సుకుమార్ అమెరికాలో పర్యటిస్తున్నాడు. కొన్ని వారాలుగా అక్కడే ఉన్నాడు. త్వరలోనే ఆయన ఇండియాకు వస్తాడు. ఇక అల్లు అర్జున్ యూరప్‌ విహార యాత్రకు వెళ్లాడు. ఓ వారం రోజుల్లో తిరిగి వస్తాడు. ఆ తర్వాత పుష్ప 2 షూటింగ్ ఉంటుందని అన్నారు.

ఇక అల్లు అర్జున్ గెడ్డం తీసేయడంతో ఈ సినిమా షూట్ ఇప్పట్లో స్టార్ట్ అయ్యే అవకాశం లేదు. ఐకాన్ స్టార్ గెడ్డం పెరగాలంటే.. కనీసం 1 నెల పడుతుంది. ఆ తర్వాత ఈ సినిమా 1 నెల నుంచి నెలన్నర షూటింగ్ ఉంటుంది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్‌కు మరో నెల ఉంటుంది. ప్రమోషన్స్, తదితర కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి ఈ సినిమా రిలీజ్ మరోసారి వాయిదా పడే అవకాశం ఉంది అనే వార్త చక్కర్లు కొడుతున్నది.

ఇదిలా ఉండగా, అల్లు అర్జున్, సుకుమార్ మధ్య క్రియేటివ్ విభేదాలు భారీగా వచ్చాయి. దాంతో ఈ సినిమా షూటింగ్ వరుసగా వాయిదా పడుతున్నదనే మరో టాక్ సోషల్ మీడియాలో కనిపిస్తున్నది. అయితే ఇలాంటి వార్తలు అల్లు ఆర్మీని కంగారుపెడుతున్నాయి. ఈ విషయాలపై ఆర్మీకి చిత్ర యూనిట్ క్లారిటీ ఇస్తే.. రూమర్లకు అడ్డుతెర పడే అవకాశం ఉంది. ప్రస్తుతానికి పుష్ప 2 చిత్రం డిసెంబర్ 6వ తేదీన రిలీజ్ కావాల్సి ఉంది.

ఇలాంటి వార్తల మధ్య ఈ సినిమాను సంక్రాంతి బరిలో దించే ఆలోచన ఒకటి. లేదా సమ్మర్‌ ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనే ప్లాన్‌తో మైత్రీ ఉందనే వార్త కూడా ప్రచారంలో ఉంది. ఇప్పటికే ఈ సినిమాపై అనేక రూమర్లు వస్తుండటం పలు గందరగోళాలకు కారణమవుతున్నది.

More from Filmibeat

Read more about: pushpa 2 allu arjun sukumar
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X