వీళ్లు లేకుండా ఆ సీక్వెల్ వర్కవుట్ అవుతుందా?

By Srikanya

హైదరాబాద్ : సీక్వెల్ కు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. అందుకే దర్శక,నిర్మాతలు సీక్వెల్ వైపు మ్రొగ్గు చూపుతూంటారు. అయితే హీరో,హీరోయిన్స్ మాత్రం సీక్వెల్ లో నటించటానికి సవాలక్ష లెక్కలేస్తూంటారు. ఆ మధ్యన అంజలి హీరోయిన్ గా రాజకిరణ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘గీతాంజలి' ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌ను తీసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు అంజలి ఈ సీక్వెల్ లో నటిస్తుందా లేదా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అయితే అందుతున్న సమాచారాన్ని బట్టి అంజలి ఈ ప్రాజెక్టులో చేయకపోవచ్చునని తెలుస్తోంది. అంజలి సైతం కాంటాక్ట్ చేయలేదని, వేరే హీరోయిన్ ని అనుకుంటున్నారని, హర్రర్ కామెడీ జానర్ అనే చెప్పుతున్నారు. అంతేకాదు శ్రీనివాస రెడ్డి సైతం ఈ ప్రాజెక్టులో ఉండకపోవచ్చు. కానీ శ్రీనివాసరెడ్డి, అంజలి కాంబినేషన్ ఈ ప్రాజెక్టుని లేపి నిలబెట్టింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Will Anjali Be A Part Of Geethanjali Sequel?

అంతేకాదు కోన వెంకట్ మార్కెటింగ్ స్ట్రాటజీ సైతం ఈ సినిమా ప్రమోషన్ లో పనిచేసింది. కోన వెంకట్ పరిచయాలతో బ్రహ్మానందం వంటి బిజీ కమిడియన్స్ సైతం వచ్చి పనిచేసారు. మరి ఇప్పడు అవన్ని ఎంత వరకూ జరుగుతాయో చూడాలంటున్నారు. రాజకిరణ్‌ డైరెక్ట్‌ చేసే ఈ చిత్రాన్ని క్రేజీ మీడియా ప్రొడక్షన్స్‌ పతాకంపై చినబాబు నిర్మించనున్నారు.

ఈ విషయాన్ని చినబాబు తెలియజేస్తూ ‘‘నాకెంతో నచ్చిన చిత్రం ‘గీతాంజలి'. ఆ చిత్రాన్ని రూపొందించిన రాజకిరణ్‌లో మంచి దర్శకుడు ఉన్నాడు. ఆయన పనితీరు నచ్చి ఓ చిత్రం చేయాలనుకున్నాను. అయితే వేరే కథతో కాకుండా ‘గీతాంజలి'కి సీక్వెల్‌ చేయాలనుకుని, ఆయనను సంప్రదించాను. ఆయన ఆనందంగా ఒప్పుకున్నారు. స్ర్కిప్ట్‌ సిద్ధమైంది. త్వరలోనే ప్రారంభించబోతున్నాం. ఓ ప్రముఖ హీరోయిన్, హీరో సహా పేరుపొందిన నటీనటులతో ఈ సినిమా చేయబోతున్నాం'' అని చెప్పారు.

రాజ్ కిరణ్ మాత్రం ఈ సీక్వెల్ ప్రాజెక్టుపై బాగా నమ్మకంగా ఉన్నారు. సబ్జెక్టు బాగా వచ్చిందని, మొదటి చిత్రం కన్నా స్క్రిప్టు,స్రీన్ ప్లే హైలెట్ గా కుదురియాని అంటున్నారు. ఈ చిత్రానికి మాటలు: శ్రీనివాస్‌ వెలిగొండ, ఛాయాగ్రహణం: రవి (కన్నడ చిత్రం ‘ఉగ్రం' ఫేమ్‌), కథ, దర్శకత్వం: రాజకిరణ్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X