అక్కినేని హీరోతో జూనియర్ అతిలోక సుందరి రొమాన్స్.. ఫ్యాన్స్కు పూనకాలు కన్ఫర్మ్!

Naga Chaitanya- janhvi Kapoor: అక్కినేని నాట వారసుడు యంగ్ హీరో నాగచైతన్య సాలిడ్ హిట్టు కోసం చాలా ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం 'తండేల్' అనే డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ మూవీ తర్వాత మరో క్రేజీ లవ్ స్టోరీ ప్రాజెక్టు చేయనున్నారట నాగచైతన్య. అదికూడా మజీలి లాంటి బ్లాక్ బస్టర్ అందించిన శివ నిర్వాణ డైరెక్టర్త తో ఓ మరో క్రేజీ మూవీ తెరకెక్కించనున్నారంట. ఈ మూవీలో.. బాలీవుడ్ యంగ్ బ్యూటీ తో నాగచైతన్య రొమాన్స్ చేయనున్నాడట. ఇంతకీ ఆ బాలీవుడ్ ముద్దుగుమ్మ ఎవరు? ఇంతకీ ఆ క్రేజీ ప్రాజెక్ట్ ఏంటో? ఓ లుక్కేద్దాం..

నాగచైతన్య ఇప్పటికే తన కెరీర్లో ఎన్నో హిట్స్ అందుకున్నారు. అందులో ఏం మాయ చేసావే. మజిలీ లవ్ స్టోరీ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. ప్రస్తుతం నాగా చైతన్య తండేల్ అనే మూవీలో నటిస్తున్నారు. ఇందులో ఆయనకు జంటగా సాయిపల్లవి నటిస్తోంది. మత్స్యకారుల జీవన విధానం ఆధారంగా చేసుకుని ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి యంగ్ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 90% షూటింగ్ పూర్తి అయింది. మరో 10 రోజులలో మొత్తం షూటింగ్ కంప్లీట్ కానున్నది.

will Bollywood herione Janhvi Kapoorplay the heroine in Naga Chaitanya s upcoming film

అల్లు అరవింద్ సమర్పణలో గీత ఆర్ట్స్ పదాకంపై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్వహిస్తుండగా దేవిశ్రీప్రసాద్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు.ఇప్పటికే మూవీ నుంచి పోస్టర్, గ్లింప్స్ మంచి ఆదరణ దక్కింది. దీంతో ఈ మూవీ కచ్చితంగా నాగచైతన్య కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తోందని అక్కినేని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ మూవీ తరువాత అక్కినేని మరో క్రేజీ ప్రాజెక్టు చేయనున్నారట. సింపుల్ లవ్ స్టోరీ గా తెరకెక్కనున్న ఈ మూవీకి శివ నిర్వాణ దర్శకత్వం వహించన్నారట. ఇప్పటికే ఈ డైరెక్టర్ మజిలీ లాంటి బాక్ల్ బస్టర్ హీట్ ను నాగచైతన్యకు అందించాడు.

ఇలా మరోసారి వీరిద్దరి హిట్ కాంబినేషన్ లో రాబోతున్న మరో లవ్ స్టోరీ అనగానే.. ఈ ప్రాజెక్ట్ పై మరింత క్యూరియాసిటీ పెరిగింది. అదే సమయంలో మరో ఇంట్రెస్టింగ్ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ లవ్ స్టోరీలో హీరోయిన్ గా బాలీవుడ్ హాట్ బ్యూటీ, అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాహ్నవి కపూర్ నటిస్తుందని అంటున్నారు. ఈ మూవీలో నాగచైతన్యతో జాహ్నవి కపూర్ అనగానే.. అక్కినేని ఫ్యాన్స్ లో ఎక్కడలేని జోష్ వచ్చేసింది.

will Bollywood herione Janhvi Kapoorplay the heroine in Naga Chaitanya s upcoming film

ఇప్పటికే జాహ్నవి కపూర్.. జూనియర్ దేవరా మూవీతో దూసుకు వెళ్తున్న విషయం తెలిసింది. ఈ మూవీలో జాహ్నవి కపూర్ అందం, అభినయం కు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దేవర తరువాత రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కనున్న ప్రాజెక్టులో కూడా పనిచేస్తుంది జూనియర్ అతిలోక సుందరి. ఈ రెండు మూవీల తర్వాత జాహ్నవి కపూర్ అక్కినేని నాగచైతన్యతో జతకట్టనున్నదట. ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్ మరియు శివ నిర్వాణ కాంబోలో తెరకెక్కనున్న మూవీ కావడంతో మూవీ ప్రకటనపై హైప్స్ పెరిగాయి. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానున్నదట.

More from Filmibeat

Read more about: naga chaitanya janhvi kapoor
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X