చిరంజీవి ఇమేజ్ కి కొత్త డెఫినిషన్ ఇచ్చేలా సబ్జెక్ట్ రెడీ చేసిన డైరెక్టర్..!?
చిరంజీవి డాన్సులకు కొత్త గ్లామర్ తెచ్చిన కొరియోగ్రాఫర్ ఎవరన్నా వున్నారంటే అది లారెన్స్ అని చెప్పక తప్పదు. తాను మెచ్చిన కొరియోగ్రాఫర్లలో లారెన్స్ ని ప్రత్యేకంగా చెబుతుంటారు చిరంజీవి. అన్నయ్య స్ఫూర్తితోనే సినీ పరిశ్రమలో ఈ స్థాయికి రాగలిగానంటాడు లారెన్స్. లారెన్స్-చిరంజీవిల మధ్య అనుబంధం గురించి పక్కన పెడితే, చిరంజీవి సినిమాకి డైరెక్షన్ చేయాలన్నది లారెన్స్ డ్రీమ్..వాస్తవానికి 'మాస్" సినిమాని చిరంజీవితోనే లారెన్స్ చేయాల్సి వున్నా, చిరంజీవి ఓవరాక్షన్ కారణంగా ఆ ప్రాజెక్ట్ నాగార్జునకి వెళ్లిపోయిందట. చిరంజీవితో సినిమా చేయాలన్న ఆశ చావని లారెన్స్, ఇంకా ఇంకా చిరంజీవి వెంట పడ్తూనే వున్నట్టు సమాచారం.
రాజకీయాల్లో ఎలాగూ చేసేదేం లేదు కాబట్టి, సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన చిరంజీవి, తన 150వ సినిమాని లారెన్స్ డైరెక్షన్ లో చేయొచ్చన్నది లేటెస్ట్ న్యూస్. చిరంజీవి ఇమేజ్ కి కొత్త డెఫినిషన్ ఇచ్చేలా సబ్జెక్ట్ తయారు చేశాననీ, ప్రాజెక్ట్ వర్కవుట్ అయితే తిరుగులేని చిత్రమవుతుందని లారెన్స్ తన సన్నిహితులు వద్ద చెప్పుకుంటున్నాడట. మరి, లారెన్స్ కోరికను చిరంజీవి నెరవేరుస్తాడా? తన 150వ సినిమాకి లారెన్స్ ని డైరెక్టర్ గా చిరంజీవి చేస్తాడా అన్నది వేచిచూడాల్సిందే..


Click it and Unblock the Notifications











