Thalaivar173: రజనీకాంత్‌కి విలన్‌గా లెజెండరీ డైరెక్టర్? కమల్‌తో మూవీకి బిగ్ సర్‌ప్రైజ్!
భారతదేశం గర్వించదగ్గ మహానటులు కమల్ హాసన్, రజనీకాంత్‌లు దాదాపు 46 ఏళ్ల తర్వాత కలిసి నటించనున్నారు. స్వయంగా కమల్ హాసన్ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలింస్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించనున్నారు. దాంతో ఈ ప్రాజెక్ట్‌పై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. కోలీవుడ్‌తో పాటు భారతీయ చిత్ర పరిశ్రమ మొత్తం ఈ సినిమా ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి. రజనీకాంత్ కెరీర్‌లో ఇది 173వ చిత్రం కావడం విశేషం. తాజాగా ఈ ప్రాజెక్ట్ నుంచి ఓ సర్‌ప్రైజింగ్ న్యూస్ ఒకటి చక్కర్లు కొడుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..
రజనీకాంత్ - కమల్ హాసన్ మూవీకి తొలి నుంచి అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. తొలుత ఈ సినిమాకు దర్శకుడిగా అనుకున్న సుందర్ సి.. ఊహించని విధంగా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత స్టార్ డైరెక్టర్ నెల్సన్ దీలిప్ కుమార్ ఈ మూవీని టేకప్ చేస్తారని వార్తలు వచ్చాయి. ఆయన కూడా ఆఫర్ తిరస్కరించడంతో దిలీప్ స్థానంలో శిబి చక్రవర్తి పేరు తెరపైకి వచ్చింది. కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్‌తో డాన్ వంటి బ్లాక్‌బస్టర్ మూవీని రూపొందించిన శిబికి మంచి గుర్తింపు ఉంది. కమల్ - రజనీ మూవీకి దర్శకత్వం వహించడానికి శిబి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించినట్లు వార్తలు వచ్చాయి.

అయితే శిబి కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారట. తలైవార్ 173 మూవీని అంగీకరించడానికి ముందు ఆయన ఓ తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించేందుకు ఓ నిర్మాణ సంస్థతో ఒప్పందం చేసుకుని అడ్వాన్స్ కూడా తీసుకున్నారట. ఇప్పుడు ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించే విషయంలో సమస్యలు ఎదురవ్వడంతో శిబి ముందుకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో శిబి కూడా రజనీ 173 మూవీ నుంచి తప్పుకున్నారట. ఇప్పుడు తాజాగా కోలీవుడ్ వర్గాలు చెబుతున్న దానిని బట్టి.. శిబి స్థానంలో అశ్వత్ మారిముత్తుకు రజనీ - కమల్ హాసన్ మూవీ దర్శకత్వ బాధ్యతలు అప్పగించారట.
ఈ ప్రాజెక్ట్ చేపట్టడానికి ఈయనకు కూడా కొన్ని టెక్నికల్ కారణాలు అడ్డంకిగా మారాయట. అశ్వత్ కూడా.. కోలీవుడ్ నిర్మాణ సంస్థ ఏజీఎస్ నుంచి ఎన్‌వోసీ పొందాల్సి ఉంది. ఆ తర్వాతే పూర్తి స్థాయిలో రజనీ చిత్రాన్ని టేకప్ చేసే అవకాశం ఉందని కోలీవుడ్ టాక్. దీంతో తలైవార్ 173కి దర్శకుడు ఎవరన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది. ఇదిలాఉండగా.. ఈ సినిమాలో పవర్‌ఫుల్ విలన్‌గా ఎవరూ ఊహించని పేరు తెరపైకి వచ్చింది. భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన తమిళ దర్శక దిగ్గజం శంకర్ ఈ సినిమాలో రజనీకాంత్‌కి విలన్‌గా నటించనున్నారట.
రజనీకాంత్, కమల్ హాసన్‌లు శంకర్ అత్యంత సన్నిహితుడు. కమల్‌తో భారతీయుడు, భారతీయుడు 2 చిత్రాలతు తీసిన శంకర్.. రజనీతో శివాజీ, రోబో, 2.0 వంటి సినిమాలు తీసి బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించడంతో పాటు టెక్నికల్‌గా భారతీయ సినిమా స్థాయిని పెంచారు. అయితే ఇదంతా గతం.. గత కొన్నేళ్లుగా శంకర్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మారుతున్నాయి. ఐ, ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ చిత్రాలు భారీ నష్టాలను మిగిల్చాయి. ప్రస్తుతం ఆయన చేతిలో ఇండియన్ 3, వేల్పారి సినిమాలు ఉన్నాయి. ఇవి ఎప్పుడు మొదలవుతాయో, ఎప్పుడు పూర్తవుతాయో తెలియని పరిస్ధితి. ఈ క్రమంలో నటుడిగా వెండితెరపై అడుగుపెట్టాలని శంకర్ భావిస్తున్నారట.
కెరీర్ తొలినాళ్లలో చిన్నా చితకా పాత్రలు చేసిన శంకర్.. ఫుల్ టైం నటుడిగా ఎప్పుడూ నటించలేదు. ఇప్పుడు కనుక ఆయన రజనీకి విలన్‌గా నటిస్తే ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుంది. అంతేకాదు.. ఈ సినిమాలో కమల్ హాసన్ ఓ కీలకపాత్ర పోషించనున్నారు. దాంతో కమల్, రజనీ, శంకర్ వంటి దిగ్గజాలను ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే ఈ సినిమా ఎక్కడికో వెళ్లిపోతుందని భావిస్తున్నారు. తొలుత శంకర్‌ను విలన్‌గా తీసుకోవాలన్న ఆలోచన దర్శకుడు శిబిది.. ఇప్పుడు ఆయన ప్రాజెక్ట్ నుంచి తప్పుకుని అశ్వత్ సీనులోకి రావడంతో ఈ ఆలోచన కార్యరూపం దాలుస్తుందా? లేదా అన్నది అనుమానంగా ఉంది. అయితే శంకర్‌ను విలన్‌గా తీసుకోవాలన్న ఐడియాకి రజనీ, కమల్‌లు కూడా గతంలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. దర్శకుడు మారినా ఈ వ్యూహాన్ని అమలు చేస్తారా? శంకర్ ఈ సినిమాలో విలన్‌గా నటిస్తారా? లేక రూమరా అన్నది తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications