NTR31: కన్నడ బ్యూటీతో ఎన్టీఆర్ రొమాన్స్? హాట్ హీరోయిన్ కు ప్రశాంత్ నీల్ గ్రీన్ సిగ్నల్?
ఇప్పుడు పాన్ ఇండియా సినిమా బాక్సాఫీస్ ని తన కంట్రోల్ లో పెట్టుకున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. తనని యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి మ్యాన్ ఆఫ్ మాసెస్ గా మార్చేసిన భారీ చిత్రమే తన "దేవర" కాగా దీనిని దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించారు. మరి ఎన్టీఆర్ తో తన కాంబినేషన్ లో రెండో సినిమా ఇది కాగా రిలీజ్ అయిన మొదటి రోజే దేవరకి కొంచెం మిక్స్డ్ స్పందన అయితే వచ్చింది.
అయినప్పటికీ దేవర సాధిస్తున్న వసూళ్లు చూసి అంతా షాకవుతున్నారు. ఇలాంటి టాక్ తో కూడా దేవర ఈ రేంజ్ పెర్ఫామెన్స్ చేస్తే ఇక ఎన్టీఆర్ నుంచి రానున్న రెండు సినిమాలు పరిస్థితి ఏంటో అనే టాపిక్ గా స్టార్ట్ అయ్యింది. కాగా ఎన్టీఆర్ నుంచి నెక్స్ట్ ఉన్న సినిమాల్లో సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సినిమా కూడా ఉంది.

మరి నీల్ ప్రభాస్ తో సలార్ యష్ తో కేజీయఫ్ అనే సినిమాలు చేసి మాస్ లో కొత్త నిర్వచనం అందించాడు. అలాంటి ఎన్టీఆర్ లాంటి బిగ్గెస్ట్ మాస్ హీరోతో ఇలాంటి దర్శకుడు సినిమా అంటే ఆ అంచనాలు పీక్స్ లో ఉంటాయి అని చెప్పాలి. కాగా అందుకు తగ్గట్టుగా ఈ మాసివ్ కాంబినేషన్ పై అంచనాలు ఆల్రెడీ నెలకొన్నాయి. కాగా ఈ సినిమాపై ఓ క్రేజీ రూమర్ అయితే ఇపుడు వినిపిస్తుంది.
ఈ చిత్రంతో తారక్ మొదటిసారిగా ఓ కన్నడ బ్యూటీతో రొమాన్స్ చేయనున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. కాగా ఆమె మరెవరో కాదు గత ఏడాది వచ్చిన "సప్త సాగరాలు దాటి" ఫేమ్ నటి రుక్మిణి వసంత్ అట. ఈమెకి ఆ సినిమాలో అటు కన్నడ సహా ఇక్కడ తెలుగులో కూడా మంచి ఫేమ్ వచ్చింది. దీనితో ఈ రకంగా ఈమె పేరుని ప్రశాంత్ నీల్ ఫైనల్ చేసినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి.

అలాగే ఈ సినిమాతోనే రుక్మిణి వసంత్ కూడా తెలుగు ఎంట్రీ ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ వార్తల్లో ఎంతమేర నిజం ఉందో అధికారిక క్లారిటీ వచ్చే వరకు ఆగి చూడాల్సిందే. ఇక ఈ బిగ్గెస్ట్ మాస్ చిత్రానికి ప్రస్తుతం "డ్రాగన్" అనే టైటిల్ గట్టిగా వినిపిస్తుండగా ఈ చిత్రాన్ని భారీ సినిమాల నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.
అలాగే ఈ చిత్రం ఈ అక్టోబర్ లేదా నవంబర్ లోనే షూటింగ్ ని స్టార్ట్ చేసుకోనుండగా ఈ చిత్రానికి సెన్సేషనల్ క్రాసోవర్ కూడా ఉన్నట్టుగా ఆ మధ్య సలార్ నటుడు పృథ్వీ రాజ్ సుకుమారన్ తెలిపాడు. సో ఈ రకంగా కూడా నీల్, తారక్ సినిమాపై ఎనలేని హైప్ నెలకొంది. మరి ఈ సినిమాల తాలూకా హై ని ఎంజాయ్ చెయ్యాలి అంటే డెఫినెట్ గా ఇంకొన్నాళ్ళు ఆగక తప్పదు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ ఈ సినిమా సహా బాలీవుడ్ లో భారీ సీక్వెల్ "వార్ 2" కూడా సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











