మహేష్, పవన్ లపై 'మా' యాక్షన్ ఉంటుందా?
శనివారం ప్రతిష్టాత్మకంగా జరిగిన స్టార్ నైట్ పోగ్రామ్ కి పవన్ కళ్యాణ్, మహేష్ బాబు అటెండు కాలేదు. అయితే దాసరి నారాయణరావు స్టార్ నైట్ పోగ్రాం కోసం కేటాయించిన మూడు రోజులూ సినీ నిర్మాణానికి దూరంగా ఉండాలని నిబంధన జారీ చేసారు. అలా చేయని వారిపై మూవీ ఆర్టిస్ట్ అశోసియేషన్(మా) చర్య తీసుకుంటుందని ప్రకటించారు. దాంతో స్టార్ నైట్ కు అటెండు కాకుండా తమ తమ సినిమాలతో బిజీగా ఉన్న పవన్, మహేష్ లపై మా చర్య తీసుకుంటుందా అనే సందేహం అందరిలో వ్యక్తం అవుతోంది. ఈ మేరకు ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ గా డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇక వీరిద్దరూ ప్రస్తుతం పులి,ఖిలాడీ చిత్రాల్లో బిజీగా ఉన్నారు. ఈ రెండు చిత్రాలనూ సింగనమల రమేష్ నిర్మిస్తున్నారు. పులి చిత్రాన్ని ఎస్.జె.సూర్య డైరక్ట్ చేస్తూండగా, ఖలేజాని త్రివిక్రమ్ డైరక్ట్ చేస్తున్నారు. గతంలో ఈ డైరక్టర్లు ఇద్దరూ ఈ హీరోలతో హిట్టు ఇచ్చినవారే కావటంతో ప్రాజెక్టుపై మంచి అంచనాలే ఉన్నాయి.


Click it and Unblock the Notifications











