బాలయ్య వద్దకు వెళ్లిన జూ.ఎన్టీఆర్ విషయం.. అతడి వల్లే, ఏమవుతుందో అని ఉత్కంఠ!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత చిత్రం ఘనవిజయం సాధించింది. ఇప్పటికి అరవింద సమేత బలమైన వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతోంది. 150 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన అరవింద సమేత ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవడం విశేషం. అరవింద సమేతతో పాటు చాలా విషయాల్లో ఎన్టీఆర్ ప్రస్తుతం వార్తల్లో నిలుస్తున్నాడు. బాలయ్య నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఎన్టీఆర్ బయోపిక్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా భాగం కాబోతున్నాడంటూ చాలా రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ అంశం గురించి మరో వార్త ప్రచారంలోకి వచ్చింది.

బాలయ్య పాత్రలో అంటూ
బాలయ్య ఈ చిత్రంలో తన తండ్రి ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్నాడు. బాలయ్య పాత్రలో జూ. ఎన్టీఆర్ నటిస్తాడని వార్తలు వినిపించాయి. ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉందో తేలాల్సి ఉంది. అదే సమయంలో ఎన్టీఆర్ ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ అందించబోతున్నాడంటూ కూడాకొత్త ప్రచారం మొదలయింది.

బాలయ్య వద్దకు ప్రతిపాదన
దర్శకుడు క్రిష్ వల్లే ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ వాయిస్ గంభీరంగా, అద్భుతంగా ఉంటుంది. ఎన్టీఆర్ బయోపిక్ లాంటి సినిమాకు యంగ్ టైగర్ వాయిస్ ఓవర్ ఇస్తే చాలా బావుంటుందని దర్శకుడుకు క్రిష్ భావిస్తున్నాడట. క్రిష్ ఈ విషయాన్ని స్వయంగా బాలయ్య ముందు ఉంచినట్లు తెలుస్తోంది.

అందరిలో ఉత్కంఠ
ఈ విషయంలో బాలయ్య ఇంకా నిర్ణయం తీసుకోలేదట. ఇటీవల జరిగిన అరవింద సమేత సక్సెస్ మీట్ కు బాలయ్య ముఖ్య అతిధిగా హాజరు కావడంతో నందమూరి అభిమానుల్లో ఆశలు పెరిగాయి. జూ. ఎన్టీఆర్ ప్రమేయం ఈ చిత్రంలో ఎలాగోలా ఉండేలా బాలయ్య నిర్ణయం తీసుకుంటాడని అంతా ఆశిస్తున్నారు.

కుటుంబ సభ్యులంతా
ఎన్టీఆర్ బయోపిక్ చిత్రానికి నందమూరి కుటుంబ సభ్యులంతా మద్దత్తు తెలుపుతున్నారు. కళ్యాణ్ రామ్ అయితే ఏకంగా తన తండ్రి హరికృష్ణ పాత్రలోనే నటిస్తుండడం విశేషం. హరికృష్ణ ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ ఈ చిత్రంలో ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో నటిస్తోంది. చంద్రబాబుగా దగ్గుబాటి రానా నటిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











