డెస్టినేషన్ వెడ్డింగ్‌గా వరుణ్ తేజ్, లావణ్య మ్యారేజ్.. పెళ్లికి పవన్ కల్యాణ్ దూరం?

మెగా ఫ్యామిలీలో పెళ్లి బాజాలు మోగే క్షణాలు దగ్గర్లోనే ఉన్నాయనే వార్త మీడియాలో ప్రచారం జరుగున్నది. గత కొద్దికాలంగా ప్రేమించుకొంటున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి తమ బంధాన్ని మరో మెట్టు ఎక్కించేందుకు రెడీ అయ్యారు. అనేక రూమర్లు, గాసిప్స్‌కు చెక్ పెడుతూ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇటీవల నిశ్చితార్థం జరుపుకొన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఇద్దరు సెలబ్రిటీల డెస్టినేషన్ వెడ్డింగ్ వార్త మీడియాలో చక్కర్లు కొడుతున్నది. డెస్టినేషన్ వెడ్డింగ్ ఎక్కడ? ఎప్పుడు? అనే వివరాల్లోకి వెళితే..

మీడియా కథనాలకు, రూమర్లకు చెక్ పెడుతూ లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ జూన్ 8వ తేదీన ఎంగేజ్‌మెంట్ చేసుకొన్నారు. మెగా ఫ్యామిలీ, లావణ్య ఫ్యామిలీ సమక్షంలో ప్రైవేట్ కార్యక్రమంగా నిశ్చితార్థం వేడుక జరిగింది. అనంతరం వారిద్దరు తమ సోషల్ మీడియా ద్వారా ఎంగేజ్‌మెంట్ ఫోటోలను మీడియాకు, అభిమానులకు రిలీజ్ చేశారు.

Will Pawan Kalyan attend for Varun Tej and Lavanya Tripathi destination wedding in Italy?

అయితే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం. ఇప్పటికే ఫ్యామిలీ మెంబర్స్‌కు పెళ్లికి సంబంధించిన తేదీలను, వివరాలను వెల్లడించినట్టు తెలిసింది. వరుణ్ తేజ్, లావణ్య వివాహం ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్‌గా జరిపించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారనే విషయం మీడియాలో ప్రచారం జరుగుతున్నది.

ఇటలీలో జరిగే డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ఇప్పటికే అతికొద్ది మంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల పేర్లను షార్ట్ లిస్ట్ చేశారు. వారికి ముందస్తుగా సమాచారం అందించారు. అతిథులకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు అని సినీ వర్గాలు వెల్లడించాయి.

అయితే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లికి పవన్ కల్యాణ్ వెళ్తారా? అనే విషయం చర్చనీయాంశమైంది. వరుణ్ తేజ్ పెళ్లి ఆగస్టు 3వ వారంలో గానీ, సెప్టెంబర్ తొలి వారంలో గానీ జరిగే అవకాశం ఉందని తెలిసింది. ఆ సమయంలో పవన్ కల్యాణ్ వారాహి యాత్రలో ఉండే అవకాశం ఉంది.

వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి కోసం పవన్ కల్యాణ్ వెళితే.. వారాహి యాత్రకు బ్రేక్ ఇచ్చి వెళ్తారు? లేదంటే.. పెళ్లి తర్వాత హైదరాబాద్‌లో నిర్వహించే రిసెప్షన్‌లో పాల్గొంటారనే వార్త మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే సన్నిహితులు మాత్రం ఇటలీలో జరిగే డెస్టినేషన్ వెడ్డింగ్‌కు పవన్ వెళ్తారు. వారాహి యాత్ర ఆ సమయంలో కొనసాగితే బ్రేక్ ఇస్తారనే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X