పవన్ కల్యాణ్‌కు ఊహించని పదవులు.. ఆ రెండు పోస్టులు చేపట్టనున్న జనసేనాని!

ఎన్నికల ఓటింగ్, వాట ఫలితాల ప్రక్రియ ముగియడంతో ప్రభుత్వ ఏర్పాట్లకు సన్నాహాలు జరుగుతున్నాయి. తాజాగా కేంద్రంలో నరేంద్రమోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన క్యాబినెట్‌లో మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయడంతో ఓ చారిత్రాత్మక ఘట్టానికి అడుగుపడింది. ఇక మిగిలిందంతా ఏపీలో ప్రభుత్వ ఏర్పాటు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఏర్పడే ప్రభుత్వం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అందరి దృష్టి పవన్ కల్యాణ్ చేపట్టే పదవులపైనే పడటమ కాకుండా భారీ చర్చ జరుగుతున్నది. ఆ వివరాల్లోకి వెళితే..

ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 95 శాతం సీట్లను సాధించి విజయకేతనం ఎగురవేసింది. దాదాపు 164 సీట్లను గెలుచుకొని వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా దక్కకుండా గెలుపు సాధించింది. దాంతో చంద్రబాబు ప్రభుత్వం జూన్ 12వ తేదీన కొలువు దీరేందుకు సిద్దమవుతున్నది.

Will Pawan Kalyan to accept Deputy CM and Home Minister for Andhra Pradesh

అయితే ఏపీ ఎన్నికల గెలుపులో కీలకమైన పాత్రను పోషించిన జనసేన, ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయబోతున్నారు. తమ పార్టీకి ఎన్ని మంత్రులు తీసుకోబోతున్నారనే విషయంపై రకరకాల ఊహగానాలు వెలువడుతున్నాయి. అయితే వాటిపై ఎలాంటి అధికారికంగా క్లారిటీ లేకపోయింది.

ఇక పవన్ కల్యాణ్ ఏ పదవి తీసుకొంటారనే విషయం తెలుగు రాష్ట్రాల్లో భారీ చర్చకు దారి తీసింది. అయితే ఆయన డిప్యూటీ సీఎంగా పదవి ప్రమాణం చేస్తారనే ఊహగానాలపై పార్టీ కూడా మౌనంగా ఉంది. అయితే పదవుల పంపిణీకి కేంద్ర ప్రభుత్వ ప్రమాణ స్వీకారం, రామోజీ రావు మరణం కొంత బ్రేక్ వేశాయి.

Will Pawan Kalyan to accept Deputy CM and Home Minister for Andhra Pradesh

తాజా మీడియా కథనాల ప్రకారం.. పవన్ కల్యాణ్ రెండు కీలక బాధ్యతలను చేపట్టబోతున్నారు. డిప్యూటీ సీఎంగా, అలాగే హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు సుముఖంగా ఉన్నట్టు తెలుస్తున్నది. అయితే చివరి నిమిషంలో పవన్ తీసుకొనే నిర్ణయం ప్రకారం మార్పులు చేర్పులు ఉంటాయి అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X