రియల్ లైఫ్ లో ప్రభాస్ కి కాజల్ రియల్ డార్లింగ్ అవ్వబోతోందా..!
సినిమా హీరోహీరోయిన్లు నిజజీవితంలో జోడీగా ఉండటం జరుగుతూనే ఉంది. లేటెస్ట్ గా కాజల్, ప్రభాస్ లు వివాహం చేసుకుంటున్నారనే వార్తలు ఫిలింనగర్ లో గుప్పుమన్నాయి. అందుకే గతంలో డార్లింగ్, ప్రస్తుతం మిస్టర్ ఫర్ ఫెక్ట్ వెంటవెంటనే చేస్తున్నారని విటిపై పలు పుకార్లు సినిమా ఇండస్ట్రీలో షికార్లు చేస్తున్నాయి. సినగతంలో కోలీవుడ్ లో సూర్య, జ్యోతిక హిట్ పెయిర్ లా ఎలా చెప్పుకునేవారో ఇప్పుడు టాలీవుడ్ లో వీరిద్దరినీ చెప్పుకుంటున్నారు.
డార్లింగ్ షూటింగ్ లో సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందిట. ఆ ప్రేమ దినదినం వృద్ధి చెందుతూ పాకాన పడిందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. షూటింగ్ లో వీరి ప్రవర్తన చూస్తుంటే ప్రేమలోకంలో పీకల్లోతు కూరుకుపోయినారు ఈ లోకంతో పనిలేనట్లుగా ఎలా ఉంటారో అలా ఉంటున్నారట. అంతగా ప్రేమ ముదిరిపోవడంతో వీరిద్దరు త్వరలో ఒక్కటి కానున్నట్లు సమాచారం. మరి రియల్ లైఫ్ లో ప్రభాస్ కి కాజల్ రియల్ డార్లింగ్ అవుతుందో లేదో కాలమే నిర్ణయించాలి.


Click it and Unblock the Notifications











