ప్రభాస్ కోసం పాకిస్తాన్ బ్యూటీ.. ఆ సినిమా కోసం క్రేజీ డైరెక్టర్ దింపుతున్నాడంట!
ప్రెజెంట్ ఇండియన్ సినిమా దగ్గర ఉన్నటువంటి బిగ్గెస్ట్ స్టార్ హీరోస్ లో మన తెలుగు స్టార్ హీరో ప్రభాస్ ఒక్కడే నెంబర్ 1 అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. తాను ఫామ్ లోకి వస్తే ఆ సినిమా వసూళ్లు ఎలా ఉంటాయో తాజా చిత్రం "కల్కి 2898 ఎడి" ప్రూవ్ చేసింది. కాగా ఈ సినిమా ఏకంగా 1000 కోట్లకి పైగా వసూళ్లు అందుకోగా ఇప్పుడు ఈ చిత్రం ఇంకా స్ట్రాంగ్ రన్ ని పాన్ ఇండియా లెవెల్లో కొనసాగిస్తుంది.
ఈ సినిమా పెర్ఫామెన్స్ తో అయితే ఫైనల్ గా మళ్ళీ తన మార్కెట్ నార్మల్ అయిపోవడమే కాకుండా మరింత పెరిగింది. అంతే కాకుండా తన నుంచి రానున్న నెక్స్ట్ సినిమాలపై కూడా భారీ అంచనాలు సెట్ అవుతుండగా ఈ సినిమాలు వరుసగా ప్రభాస్ నుంచి దర్శకుడు నాగ్ అశ్విన్, ప్రశాంత్ నీల్ లతో సలార్, కల్కి సీక్వెల్ లు చేయనుండగా వీటితో పాటుగా దర్శకుడు మారుతీతో "ది రాజా సాబ్" అలాగే దర్శకుడు సందీప్ రెడ్డి వంగతో "స్పిరిట్" అనే పాన్ ఆసియా చిత్రం చేస్తున్నాడు.

అయితే వీటి అన్నిటితో పాటుగా టాలెంటెడ్ దర్శకుడు హను రాఘవపూడితో "ఫవుజి" సినిమాని ప్రభాస్ చేస్తున్నాడు. కాగా ఈ చిత్రాల్లో అయితే ఓ సినిమా మొట్ట మొదటిగా ప్రభాస్ పాకిస్తాన్ బ్యూటీతో రొమాన్స్ చేయనున్నాడు అని ఇంట్రెస్టింగ్ గాసిప్స్ మొదలయ్యి సినీ వర్గాల్లో వైరల్ గా మారాయి. కాగా పై చిత్రాల్లో దాదాపు అన్ని సినిమాల్లో హీరోయిన్స్ ఫిక్స్ అయ్యారు.
ఒక్క సందీప్ రెడ్డి వంగ అలాగే హను రాఘవపూడి సినిమాకి తప్ప. మరి ఈ రెండిట్లో పాన్ ఆసియ సినిమా కాబట్టి స్పిరిట్ కి అనుకుంటారేమో.. కాదు హను రాఘవపూడి సినిమాకి పాకిస్తాన్ నటిని మేకర్స్ తీసుకోనున్నారట. దీనితో మొట్ట మొదటిసారి ఓ పాకిస్తాన్ హీరోయిన్ తో ప్రభాస్ రొమాన్స్ చేయనున్నాడట. కాగా ప్రస్తుతానికి ఓ హీరోయిన్ తో చర్చలు జరుగుతున్నాయట.

మరి ఆమె ఎవరు ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఈ చిత్రం ఇండియా బార్డర్ నేపథ్యంలో తెరకెక్కేది అన్నట్టుగా టాక్ ఉంది. అందుకే ఇలా ప్లాన్ చేస్తున్నారు కావచ్చు. కాగా ఇప్పుడు ప్రభాస్ కల్కి సక్సెస్ ని ఎంజాయ్ చేస్తుండగా ఈ సినిమా తర్వాత ప్రభాస్ సలార్ 2, కల్కి 2 సినిమాలు స్టార్ట్ చేయనున్నాడు.
అలాగే ది రాజా సాబ్ కూడా షూటింగ్ పూర్తి చేస్తుండగా ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తుండగా ఈమెతో కూడా ప్రభాస్ కి ఇది మొదటి సినిమానే కాగా ఈ సినిమాతో మాళవిక టాలీవుడ్ కి పరిచయం అవుతుంది. ఈమెతో పాటుగా నిధి అగర్వాల్ కూడా నటిస్తుండగా రాధే శ్యామ్ యంగ్ గర్ల్ రిద్ధి కుమార్ కూడా ఈ సినిమాలో


Click it and Unblock the Notifications











