Rajinikanth ఏపీ గవర్నర్‌గా రజనీకాంత్?.. తలైవాకు దక్కబోతున్న అరుదైన గౌరవం!

సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ మూవీ సక్సెస్‌ జోష్‌తో బాక్సాఫీస్ వద్ద సంచలన కలెక్షన్లు నమోదు చేస్తున్నాయి. గత కొద్దికాలంగా వరుస పరాజయాలతో జర్నీ కొనసాగిస్తున్న రజనీకాంత్ బాక్సాఫీస్ దిమ్మ తిరిగే కలెక్షన్లను సాధించాడు. జైలర్ మూవీతో బ్లాక్ బస్టర్ విజయం అందుకొన్న రజనీకాంత్‌కు మరో అరుదైన గౌరవం దక్కే అవకాశం కనిపిస్తున్నది. గత రెండు రోజులుగా కేంద్ర ప్రభుత్వం గౌరవప్రదమైన, నామినేట్ పోస్టును కట్టబెట్టేందుకు రెడీ అవుతున్నదనే వార్త మీడియాలో ప్రచారం అవుతున్నది. ఆ వివరాల్లోకి వెళితే..

కెరీర్ చరమాంకలో హిట్టు కొట్టలేకపోతున్నాడనే విమర్శలకు రజనీకాంత్ తాను నటించిన జైలర్ చిత్రంతో ధీటైన జవాబిచ్చాడు. జైలర్ సినిమా రిలీజ్ కాకముందే హిమాలయాలకు వెళ్లి అధ్యాత్మిక చింతనలో మునిగిపోయారు. హిమాలయాల నుంచి ఆయన దేశంలోని పలు పుణ్య క్షేత్రాలను దర్శించుకొని వచ్చాడు. వారణాసి, బద్రీనాథ్ లాంటి ప్రదేశాలను రజనీ చుట్టి వచ్చారు. జైలర్ బాక్సాఫీస్‌ను ఆస్వాదించడం పక్కన పెడితే.. పెద్దగా పట్టించుకోకుండానే తన పని తాను చేసుకొని వెళ్లాడు.

Rajinikanth Governor

అయితే జైలర్ రిలీజ్ సమయంలో తీర్ధయాత్రలు, అధ్యాత్మిక పర్యటనలో ఉన్న రజనీకాంత్ వివాదాస్పదంగా మారారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రాజధానికి వెళ్లి సీఎం యోగిని కలుసుకొన్నారు. కలుసుకోవడం వరకు ఏ మాత్రం తప్పులేదు. కానీ ఏకంగా సీఎం యోగికి పాదాభివందనం చేయడం చేయడం అభిమానులను, తమిళ వాసులను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది.

ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి కాళ్లకు నమస్కరించడంతో రజనీకాంత్‌పై తమిళ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సూపర్ స్టార్ హోదా ఉన్న వ్యక్తి తమిళుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారనే విమర్శవలు వినిపించాయి. అదే సమయంలో జైలర్ కలెక్షన్లు కూడా భారీగా పడిపోయాయి. అయితే అలాంటి వార్తలను పట్టించుకోకుండా నేరుగా బెంగళూరు వెళ్లి తాను పనిచేసిన బస్ డిపోకు వెళ్లి తన అనుభూతులను గుర్తు చేసుకొన్నారు.

ఇక ఇలాంటి విషయాలు పక్కన పడితే.. గత రెండు రోజులుగా రజనీకాంత్‌కు గవర్నర్ పదవిని కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ పావులు కదుపుతున్నారు. ఇందుకు సంబంధించిన వ్యవహారంపై కసరత్తు చేస్తున్నారు. త్వరలోనే రజనీకాంత్‌కు ఏపీ గవర్నర్ పదవి ఇస్తూ అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది అనే వార్త వైరల్ అవుతున్నది. అయితే ఈ వార్త నిజమా? కాదా అనే విషయంపై బీజేపీ పెద్దలు కూడా పెదవి విప్పడం లేదు. అయితే ఈ పదవి ఆయనను వరిస్తుందో లేదో వేచి చూడాల్సిందే.

ఇదిలా ఉండగా, జైలర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద తన పని తాను చేసుకుపోతున్నది. ఇప్పటికే ఈ చిత్రం ఇండియాలో 400 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 600 కోట్లు వసూలు చేసింది. ఇంకా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిలకడగా వసూళ్లు సాధిస్తున్నది. ఈ నేపథ్యంలో రజనీకాంత్‌కు గవర్నర్ పదవి వస్తుందనే వార్తతో తలైవా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X