‘అగ్నిపథ్’ తెలుగు రీమేక్‌లో రామ్ చరణ్?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అమితాబ్ బచ్చన్ నటించిన 'జంజీర్' రీమేక్ ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఆ విషయం పక్కన పెడితే తెలుగులో ఓ హిందీ సూపర్ హిట్ సినిమాను రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడట రామ్ చరణ్. అది మరేదో కాదు..ఇటీవల విడుదలైన హృతిక్ రోషన్ సూపర్ హిట్ మూవీ 'అగ్నిపథ్'.
అగ్నిపథ్ సినిమా చూసిన రామ్ చరణ్ ' ఆ సినిమా అద్బుతంగా ఉందని, ఇంతటి ఎమోషనల్ యాక్షన్ మూవీ నేను ఇంత వరకు చూడలేదు, హృతిక్ నటన అద్భుతం, అతని పెర్ఫార్మెన్స్‌కు హాట్సాఫ్' అంటూ కామెంట్స్ చేశాడట. చరణ్ తీరు చూస్తుంటే ఈ సినిమా తెలుగులో రీమేక్‌లో నటించడం ఖాయంగా కనిపిస్తోంది, అలా చేసి ఇక్కడ మరో బంపర్ హిట్ కొడితే తనకు తిరుగు ఉండదని చరణ్ ఆలోచనగా కనిపిస్తుందని చర్చించుకుంటున్నారు.
ప్రస్తుతం రామ్ చరణ్ తేజ్ సంపత్ నంది దర్శకత్వంలో 'రచ్చ' సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన తమన్నా నటిస్తోంది. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈచిత్రానికి నిర్మాతలు : ఎన్వీ ప్రసాద్, పారాస్‌జైన్, సమర్పణ: ఆర్.బి.చౌదరి, సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి.


Click it and Unblock the Notifications











