రామ్ చరణ్- అనిల్ రావిపూడి కాంబో.. ఊపందుకున్న ప్రచారం
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చిత్రీకరణ దాదాపు డెబ్బై శాతం పూర్తైనట్టు ప్రకటించారు. ఇక చరణ్‌కు సంబంధించిన షూటింగ్ పార్ట్ మార్చి నాటికి పూర్తి కానట్టు తెలుస్తోంది. అటుపై డబ్బింగ్.. మిగతా కార్యక్రమాలను కలుపుకుంటే ఏప్రిల్ చివరి కల్లా ఆర్ఆర్ఆర్ నుంచి బయట పడే అవకాశముంది. ఈ లెక్కన 2020లో రామ్ చరణ్ రెండు సినిమాలు అభిమానుల ముందుకు వచ్చే అవకాశముంది. ప్రస్తుతం ఈ టాపిక్‌పైనే చర్చ నడుస్తోంది.

నిర్మాతగానూ బిజీ..
ఒకవైపు ప్యాన్ ఇండియా చిత్రంలో నటిస్తూనే మరో జాతీయ సినిమాను (సైరా)ను నిర్మించాడు. అది చిత్రీకరణలో ఉండగా.. సైరాను అద్భుతంగా నిర్మించాడు. తాజాగా కొరటాల చిరు కాంబోలో రాబోతోన్న మూవీని సైతం నిర్మిస్తున్నాడు. ఇలా హీరోగా బిజీగా ఉంటూనే నిర్మాతగానూ విజయాలను అందుకుంటున్నాడు. ఆర్ఆర్ఆర్ నుంచి బయటకు వచ్చాక ఈ ప్రాజెక్ట్‌పై ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రంలో స్పెషల్ అప్పియరెన్స్..
ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్‌తో కలిసి నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించేసింది యూనిట్. అలాగే ఈ సినిమాలో ఓ స్పెషల్ అప్పీయరెన్స్ కూడా ఉండబోతోందని టాక్ నడుస్తోంది. ఇదిలా పక్కన ఉంచితే తాజాగా మరో విషయంపై ప్రచారం ఊపందుకుంది.

కథల కోసం గాలింపు..
వినయ విధేయ రామ లాంటి డిజాస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్న చరణ్‌కు ఆర్ఆర్ఆర్ బాగానే కలిసి వస్తుంది.అయితే అది హిట్ అయితే సింహభాగం రాజమౌళికే దక్కుతుంది. మిగిలిన దాంట్లో యంగ్ టైగర్ షేర్ కూడా ఉంటుంది. సో చెర్రీ తన స్టామినాను ప్రూవ్ చేసుకోవాలంటే సోలో హిట్ కొట్టాలి. అందుకే చరణ్ సైతం మంచి కథల కోసం వెతుకుతున్నట్లు టాక్.

ఫామ్‌లో ఉన్న అనిల్..
ఎఫ్2 లాంటి భారీ హిట్ సినిమా తీసిన దర్శకుడు అనిల్ రావిపూడికి సూపర్ స్టార్ మహేష్‌తో చాన్స్ వచ్చింది. మహేష్‌తో కేవలం ఐదు నెలల్లోనే సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని తీసి అందర్నీ షాక్‌కు గురి చేశాడు. ఈ క్రమంలో అనిల్‌పై మెగాకన్ను పడినట్టు తెలుస్తోంది. ఒకవేళ సరిలేరు భారీ హిట్ కొడితే గనక అనిల్ రావిపూడిని చరణ్ లాక్ చేస్తాడేమోనని తెలుస్తోంది. మరి చూడాలి ఏం జరుగుతుందో.


Click it and Unblock the Notifications











