ఈ రోజే మీటింగ్ :రామ్ చరణ్ ఆ దర్శకుడుకి ఛాన్స్?
హైదరాబాద్ : రచ్చతో ఆ మధ్యన రామ్ చరణ్ ఓ చిన్న దర్శకుడుకి ఛాన్స్ ఇచ్చారు. ఆ తర్వాత మొన్న వరస ఫ్లాపుల్లో ఉన్న కృష్ణ వంశీ తో గోవిందుడు అందరి వాడేలే చిత్రం చేసారు. అలా విభిన్నమైన డెసిషన్స్ తో ఆయన ముందుకు వెళ్తున్నారు. అయితే రీసెంట్ గా ఆయన తన తదుపరి చిత్రం శ్రీను వైట్ల తో చేస్తారని టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు అది జరగటం లేదని తెలుస్తోంది. ఆయన దృష్టి శ్రీవాసు పై ఉందని సమాచారం. వరస ఫ్లాఫుల్లో ఉన్న గోపిచంద్ కు లౌక్యంతో హిట్ ఇచ్చిన శ్రీవాసు తో ఆయన ముందుకు వెళ్తున్నారని సమచారం.
అంతకుముందు కోన వెంకట్ చెప్పిన ఓ సబ్జెక్టుని రామ్ చరణ్ ఓకే చేసారు. దాంతో కోన వెంకట్ ఇప్పుడు శ్రీవాస్ ని అక్కడ ప్రపోజ్ పెట్టినట్లు సమాచారం. ఆ కథకు శ్రీవాసు అయితే న్యాయం చేస్తారని రామ్ చరణ్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దాంతో ఈ రోజు రామ్ చరణ్ ని శ్రీవాసు కలవనున్నారు. ఈ ప్రాజెక్టు ఓకే అయితే శ్రీవాస్ పెద్ద దర్సకుల లీగ్ లో చేరిపోయినట్లే. ఆయన ఇంతకు ముందు మంచు కుటుంబం తో హిట్ చిత్రం రూపొందించిన సంగతి తెలిసిందే.
శ్రీవాసు రీసెంట్ హిట్ లౌక్యం విషయానికి వస్తే...

ఈ మధ్య కాలంలో హిట్ కు మొహం వాచిన హీరోల్లో మొదటగా చెప్పుకోవాల్సింది గోపీచంద్ నే. అయితే అతని తాజా చిత్రం లౌక్యం మాత్రం అతన్ని ఒడ్డున పడేసిందనే చెప్పుకోవాలి. ఘన విజయం సాధించకపోయినా హిట్ టాక్ తో రన్ అవుతోంది. ముఖ్యంగా ఫెస్టివల్ సీజన్ ని ప్లస్ చేసుకుంటూ ముందుకు సాగుతోంది. మహేష్ ఆగడు ఫ్లాప్ కావటం, కృష్ణ వంశీ గోవిందుడు అందరి వాడేలే చిత్రం యావరేజ్ అవ్వటం గోపీ కి కలిసి వచ్చింది. దాంతో అతను చాలా సంతోషంగా ఉన్నాడు.
లౌక్యం విజయం గురించి గోపీచంద్ మాట్లాడుతూ... తన కెరీర్ లోనే హైయిస్ట్ గ్రాసర్ అని చెప్పారు. తన గత హిట్స్ శౌర్యం, లక్ష్యం, సాహసం ల కన్నా ఈ చిత్రం ఎక్కువ కలెక్టు చేసిందని చెప్పుకొచ్చాడు. చిత్రం మొదటి నుంచి చివరి వరకూ హీరోయిజం ని ప్రక్కన పెట్టి నవ్వించటమే పనిగా పెట్టుకోవటంతో సినిమా ఒడ్డున పడిపోయింది. ముఖ్యంగా టాక్సీ డ్రైవర్ గా బ్రహ్మానందం, టీవీ సీరియల్ స్టార్ గా ధర్టీ ఇయిర్స్ ఇండస్ట్రీ ఫృధ్వీ ల కామెడీ సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి.


Click it and Unblock the Notifications











